Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


సీ. ధరణీంద్రుఁడైనట్టి ♦ దశరథున కరదం
               బులు పది గలవంచుఁ ♦ బలుకునటుల
    దైత్యేశుఁడై నట్టి ♦ దశకంఠునకుఁ గంఠ
               ములు పది కలవంచుఁ ♦ బలుకునటుల
    దితిజసేనానియౌ ♦ త్రిశిరునకును మూఁడు
               తలలు గలవటంచుఁ ♦ బలుకునటుల
    ఋషిపుత్రుఁడైనట్టి ♦ ఋశ్యశృంగునకొక్క
               మనుబోతు కొమ్ముండె ♦ ననెడునటుల

గీ. వినుము ప్రాచీన బర్హి కి ♦ వేయిగనులు
    కలవని పురాణములు పల్కుఁ ♦ గంఠమెత్తి
    వేయికన్నులు నాకుఁ గ ♦ న్పింపలేదు
    పొడలుమాత్రము కన్పించె ♦ నొడలినిండ. 122

సీ. మాండూక్యముని లోక ♦ మాన్యుండు మండూక
                మునకు జన్మించినాఁ ♦ డనెడిరీతి
    సుశ్లోక చరితుండు ♦ శుకయోగి శుకిగర్భ
                మున సంభవించినాఁ ♦ డనెడిరీతి
    మౌనితల్లజుఁడైన ♦ శౌనక బ్రహ్మర్షి
                శునిగర్భమునఁ గల్గె ♦ ననెడురీతి
    అఖిలాస్త్రసంవేది ♦ యైన యశ్వత్థామ
                యశ్వమునకుఁబుట్టె ♦ ననెడిరీతి

గీ. వినుము ప్రాచీన బర్హికి ♦ వేయిగనులు
    కలవని పురాణములు వల్కుఁ ♦ గంఠమెత్తి

28