Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


కం. కలకల నవ్వుచు దిశలన్
     గలకలమను నెమ్మొగంబు ♦ కాంతులు పర్వన్
     గలకంఠస్వరములతోఁ
     గలవాణులు పాడుచుండఁ ♦ గా విని యంతన్. 110

గీ. రాచబాటను విడనాడి ♦ ప్రక్కనున్న
    చంద్రకాంతశిలాచయ ♦ స్థగితమైన
    వీధిఁబడి పోవుచుండఁ ద్రి ♦ విష్టపమునఁ
    గానరాని విడ్డూరముల్ ♦ గానిపించె. 111

సీ. శ్రోత్రియవరుఁడైన ♦ సోమయాజులు సాని
               కొంప తల్పులు చేతఁ ♦ గొట్టుచుండ
    వీరగంధముతోడఁ ♦ బెనఁగి కూలిన మల్లు
               సానివాడఁ బచారు ♦ సల్పుచుండ
    యజ్ఞయాగాదుల ♦ నాచరించిన యోగి
               రోపడంతుల యిండ్లు ♦ రోయుచుండ
నిట్రించి తపములో ♦ నెగ్గిన జటిలుండు
               బొఁజుగుబోటుల పౌఁజు ♦ పొంతనుండ

గీ. దారి తెలియక జడదారి ♦ తారుచుండఁ
    గొంటె తెఱగంటి కన్నె గ ♦ న్గొట్టుచుండ
    ననుపుకాఁడట్టె పెడనవ్వు ♦ నవ్వుచుండ
    నల్లకల్లోలమైయుండె ♦ నాకపురము. 112

చం. విసవిస సోమయాజి యొక ♦ వీధిని బోవుచు వేశ్యకాంతతో
      గుసగుసలాడుటెల్లఁ గని ♦ కోపనగావున సోమిదమ్మయున్
      బుసబుసలాడి భూస్థలిని ♦ బోకడ లిట్టివియున్నె యంచుఁ దాఁ
      దనతన పూవుటీరమొక ♦ దానిని దారెను దొంగదారినిన్. 113

25