Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    నీలాబ్దమాలికా ♦ నిచయంబు చెలరేఁగి
               కోట కొమ్మలఁజిక్కి ♦ కొనుచునుండు

గీ. నభ్రవీధీ విటంకంబు ♦ నందరుగు వి
    మానములు సౌధములఁదాకి ♦ మరలుచుండు
    నాపురీ సంస్థితులను గ ♦ న్నారఁజూడ
    మేఘమండలమందున్న ♦ మెలపుదోఁచు. 92

వ. నేనంతట నెమ్మదిగా నడుగులు లెక్కించుకొనుచు ముందులకుఁ బోవంబోవ. 93

సీ. నగ్న లైరాగ ని ♦ ర్మగ్నలై చద లేటి
               యందున జలకంబు ♦ లాడువారి
    జుమ్మనుతేంట్లతో ♦ జూజంబులాడుచు
               హరిచందనము క్రింద ♦ నొరగువారి
    కోడాడు కొంగ్రొత్త ♦ కోడెకాండ్రనుజాచి
               వాలారుచూపులఁ ♦ బట్టువారి
    మేలువారలఁగూడి ♦ మిన్నేటి యిసుకతి
               న్నెలను వెన్నెలరేల ♦ మెలఁగువారి

గీ. గంగగట్టునఁ గడిమిడి ♦ గట్టి నేల
    నీరములపొంత తమయంత ♦ కూరుచుండి
    చిత్తరువు వ్రాయు బిత్తర ♦ చేడియలను
    నివ్వెర పడిపోయితి నిదా ♦ నించిచూచి. 94

గీ. కంచుకంబుఁదీసి ♦ కడగంటితోఁగాంచి
    జడుపులేక దుమికి ♦ మడుగులోన

21