సూతపురాణము.
గీ. బండవానిచేతి చిటేలు ♦ బదరు వేల్పు
టాలి కీల్జడ వ్రేటు పె ♦ డేలుమనఁగ
సొమ్మసిలకుండఁ గన్నీరు ♦ గ్రమ్మకుండ
నొంటిప్రాణంబుతోనైన ♦ నుండుటరిది. 88
గీ. గిల్లుకొఱుకుల పొత్తంబు ♦ నెల్లఁజదివి
యారితేరిన యామె స ♦ య్యాటలందు
బడుగు బైరాగి కెట్టు లీ ♦ పాట్లు తెలియు ?
వంగి జోహారుఁజేయు టే ♦ పాటియెఱుఁగు ? 89
గీ. మర్త్యలోకవాసుఁడనెడి ♦ మాటవిన్నఁ
బులకరించెడి మేనితోఁ ♦ బొంగిపోయి
యీమె మోహాంబునిధిలోన ♦ నీదులాడు
ననుచుఁ బెద్దలు చెప్పెద ♦ రామెఁగూర్చి. 90
వ. అంచుఁ కొంతవడి వితర్కించి, యీమె బారి కగ్గముగాకుండు టుచితంబని తలంచి, యోగమాయాప్రభావంబున నదృశ్య శరీరుండనై దేవలోకంబు నాల్గుమూలలు గాలింప నుంకించి దశదిశలుపలక్షింప. 91
సీ. ఎత్తైన నెత్తమ్ము ♦ లెక్కి బారలు చాప
శిశిరాంశు బింబంబు ♦ చేతఁజిక్కు
పరికించి కనుగొన్న ♦ భారతఖండంబు
ప్రతలంబు రీతిఁ గ ♦ న్పట్టుచుండు
చదలంటు మ్రాకుల ♦ సందుగొందులదూరి
కుందును బిచ్చుక ♦ కుంటువేల్పు
20