Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    వింత దేశంబు దీనిలో ♦ వేగుటెట్టు
    లనుచు నాందోళితస్వాంతుఁ ♦ డైతి నేను. 82

గీ. పాఱు సెలయేళ్ళ నీటితుం ♦ పరలతోడ
    విరుల క్రొందావి విరఁజిమ్ము ♦ తరులనీడ
    సురల యాచారములనెల్లఁ ♦ జూడఁగోరి
    యెదురుచూచుచు నిలుచున్న ♦ యింతలోన. 83

-♦ త్రివిష్టపసందర్శనము ♦-



కం. లెంకలు వంకల నిలఁబడి
     యంకిలిమాన్పన్ స్ఫురత్సు ♦ మాంచద్ధూళీ
     పంకిల ఘంటాపథమునఁ
     బంకేజాతాస్యయోర్తు ♦ వచ్చుచునుండన్. 84

గీ. అంగజాలల నెవ్వరీ ♦ యాఁడుపడుచు
    తెల్పుఁడంచును నేను బ్రా ♦ ర్థించినంత
    వారు తెల్పిరి యూర్వశీ ♦ భామ యీమె
    యధికలావణ్యసీమ, వే ♦ శ్యాలలామ. 85

గీ. ఎదురులేనట్టి నెఱజాణ ♦ యెమ్మెలాఁడి
    యీమె వాంఛితార్థంబు లీ ♦ డేర్పకున్నఁ
    దిట్టుఁ దినకుండఁ బోవలే ♦ రెట్టివారు
    మాటినంగ యాయము యంచు ♦ మాటఁదెల్ప. 86

చం. దడదడలాడె గుండెలు య ♦ దాయదలైమును దొంగప్రొద్దునన్
      విడివడిపోయి పైకొనఁగ ♦ వెంపరలాడుచుఁ జేర నర్జునుం
      డొడబడకుండినం గినిసి ♦ యుంకి, నపుంసకుఁజేసె నీమె నేఁ
      డుడుగునె యొంటి నన్గనిన ♦ నుక్కిరి బిక్కిరి చేసి చంపదే. 87

19