సూతపురాణము.
చం. విపుల సరోవరంబొకఁడు ♦వీక్షణమాలిక కడ్డురాఁగ నే
నపుడు తలంచినాఁడ నిది ♦ యౌఁగదమానసమంచు భంగముల్
తపతపమంచుఁ గూలములఁ ♦ దాఁకుచుఁ బైఁబడుచుండ నింతలో
రెపరెపమంచు లేచిచనె ♦ ఱివ్వున మింటికి రాజహంసలున్. 79
ఉ. బంగరు పూతఁబూసినవి ♦ భాతిని దోఁచెడి తమ్మితూండ్లతోఁ
దొంగలి ఱేకులందెగడి ♦ దూకొనివచ్చెడి కమ్మతావులున్
రంగరువన్నె చిన్నెగల ♦ రంగుపులుంగుల నంగికూయి యు
ప్పొంగఁగఁజేసె నన్నుఁ బరి ♦ పూర్ణ రసానుభవంబుఁగూర్చుచున్. 80
ఉ. ఏమియు దూరభారమని ♦ యెంచక నేను ద్రివిష్టపంబుఁ గ
న్గోమదిఁ బట్టుఁబట్టి యిది ♦ గో! యదిగో!! యని పోయి పోయి బి
డ్డా! మిహిరుండు కన్పడని ♦ యట్టి పొలంబుల దాఁటిపోయి యా
యా మడ లుత్తరించి మఱి ♦ యామడలెన్నియో యేగి నిల్వఁగా. 81
సీ. దూదిపింజలరీతి ♦ దులదుల పడసాఁగెఁ
బైనుండి హైమంబు ♦ పట్టపగలె
పూగుత్తులను భ్రాంతి ♦ పుట్టఁగా మిక్కిలి
కసిదీర వడిగండ్లు ♦ విసరికొట్టె
మిట్టమధ్యాహ్నంబె ♦ మిథునముల్ చెలరేఁగి
చెట్టుచెట్టులచుట్టు ♦ చేరసాఁగె
కనుఱెప్పపాటులో ♦ గలిసినమిధునమ్ము
లప్పుడే తారుమా ♦ రగుచునుండె
గీ. చేతులును గాళ్ళు క్రొవ్వలి ♦ చేతనపుడు
కొంకరలు పోవఁజొచ్చెను ♦ గొలఁది కొలఁది
18