సూతపురాణము.
యజ్ఞంబు పరిసమాప్తిఁగావించి సగర సార్వభౌముండు కాలాను సరణంబుగా, దివంగతుఁడైన, నఖిలభూజనమనఃప్రియంబుగాఁ బట్టాభిషిక్తుండై, తాతలు సుగతిహీనులగుటకు నతిదుఃఖితుఁడై. 62
గీ. ప్రథితగుణుఁ డంశుమంతుఁ డ ♦ త్యధికభక్తిఁ
దాతలకు సద్గతులు గూర్ప ♦ దైత్యవైరిఁ
గూర్చి ఘోరతపముఁజేసి ♦ కొట్టకొనకుఁ
జేయునది లేక ముక్తిని ♦ జెందెనంత. 63
గీ. అంశుమంతుని పౌత్రకుఁ ♦ డౌ భగీర
థుండు నిష్ఠాగరిష్ఠుఁడై ♦ దొడ్డతపముఁ
గాలి బొటమనవ్రేలిపై ♦ గాలిఁదినుచుఁ
జేసి గంగాశివులను మె ♦ చ్చింపనపుడు. 64
సీ. కడలెత్తి మ్రోగుచు ♦ నొడలెఱుంగక గంగ
చిడిముడిపాటుతో ♦ మిడిసిపడుచు
సుడిగుండములతోడ ♦ శూన్యంబులోనుండి
నుచ్చిళ్ళుగ్రక్కుచు ♦ నులిసి నులిసి
శివ జటాజూటంబుఁ ♦ జేరి యందుండి బ్ర
హ్మావర్తదేశంబు ♦ నందుఁ జొచ్చి
త్రోవఁజూప భగీర ♦ థునివెంటఁ గ్రేళ్ళుఱు
కుచు సాఁగి దేశముల్ ♦ కొన్ని కడచి
గీ. సగరవసుమతీశ్వర తనూ ♦ జాతచయము
గ్రొచ్చి త్రవ్విన బొరియల ♦ గుండఁబోయి
బూదెరాసులఁ దిన్నఁగాఁ ♦ బొడిచి తడిపి
గతులు కల్పించెనంట దు ♦ ర్మతుల కంట. 65
14