సూతపురాణము.
నలువురుచేరి పట్టుకొని ♦ న్యాదముఁ జేసెదరంచువే రసా
తలమున డాఁగనోపునిది ♦ తథ్యము తప్పదటంచుఁ జెప్పుచున్. 51
కం. జన్నము పాడై పోయిన
మన్నింపఁడు తండ్రి మనల ♦ మక్కువతోడన్
మున్నెన్నఁడు చేకూరని
విన్నదనము సూర్యవంశ ♦ వీరులకబ్బున్. 52
కం. కావునఁ గుతలంబెట్టెటొ
వేవేగన్ గ్రొచ్చిత్రవ్వి ♦ ద్విట్చక్రంబున్
జావఁగఁగొట్టి హయంబున్
భూవరునకు నీయవలయుఁ ♦ బోడిమిననఁగన్. 53
చం. అగునగునంచు రాకొమరు ♦ లప్డపుడే కొఱముట్లుతెచ్చి వా
రగణిత శక్తి సంపద న ♦ హర్నిశలుం ధర గ్రొచ్చిగ్రొచ్చి యే
పగిదినినైన ఘోటకముఁ ♦ బట్టి నృపాలవతంసు యజ్ఞమున్
ముగిసెడునట్టు చేయుటకుఁ ♦ బూనిరి క్రొవ్వితదేకచిత్తులై. 54
చం. బొరియలుపెట్టి తాల్మిఁగొని ♦ భూమినిద్రవ్వఁగ ఱాతిలోపలన్
వరలెడికప్పరీతి నొక ♦ వైపున గోచరమయ్యె ముంగలన్
దురగమొకండు మౌనికుల ♦ ధూర్వహుఁడౌ కపిలుండు ధారుణీ
శ్వరతనుజాతులందఱును ♦ బాపురె! బాపురెయంచునార్చుచున్. 55
కం. గికురించిమనల నీ ఘో
టకముం గొనితెచ్చి యిచ్చ ♦టన్ జపమనుచున్
ముకుమూసికొనియె వీఁడని
యెకసక్కెములాడుచుండ ♦ఋషి చంద్రుండున్. 56
12