Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    సగర సార్వభౌమునిజేరి ♦ సంగతులను
    విన్నవింప నాలించి పృ ♦ థ్వీ వరుండు. 47

చం. అఱువదివేల పుత్రకుల ♦ నందఱిఁబిల్చి తురంగరత్నమున్
      సురపురినున్నఁ దెండు మద ♦ శోభితులై రిపులెవ్వరేనియున్
      బొరిఁబొరి నడ్డువచ్చు నెడ ♦ బోరలుచీల్చుచు సూర్యవంశపుం
      బరువు, ప్రతిష్ఠ, నిల్పి గరు ♦ వంబును జూపుఁడటంచుఁబంపఁగన్. 48

సీ. ఉత్సాహపూర్ణులై ♦ యుద్భటారభటులై
               యుద్వేగవంతులై ♦ యోర్పు లేక
    సగరావనీభర్త ♦ సంజాతులెల్లరు
               వార్వంబు నెమకంగ ♦ బయలుదేరి
    వారాశిపర్యంత ♦ వసుమతీ తలమెల్ల
               గాలించి గాలించి ♦ కత్తలాని
    ఎచ్చోటఁగనరాక ♦ యేమేనితోఁచక
               ముడివడ్డ మోముతో ♦ ముసుఁగువెట్టి

గీ. యురుపరీభావ ఖిన్నులై ♦ యొక్కచోటఁ
    గూడి యందఱు కర్జంబు ♦ లాడికొనుచు
    నసకమున వారిలో నొక్కఁ ♦ డౌడుఁగఱచి
    తెలివివాఱిన మోముతోఁ ♦ బలికె నిటుల. 49

చం. కొకిబికి కొండగూడెములు ♦ గుట్టలు మెట్టలు చెట్టుపుట్టలున్
      బెకబెకలాడు మాడెములు ♦పిల్చినఁ బల్కెడి పట్టణంబులున్
      సకలముఁజూచి చూచియును ♦ జాతరజక్కినిగాంచమైతి మే
      మొకమున భూత లేశ్వరుని ♦ మోసలఁజేరఁగ నేర్తు మైననున్, 50

చం. తెలిపెద నాలకింపుఁడొక ♦ తీరును యజ్ఞ తురంగ మెంతయో
      తెలివి కలట్టి దీ కుతల ♦ దేశమునందెట డాఁగియుండినన్

11