ద్వితీయాశ్వాసము
గీ. సభికు లెల్ల రానంద ర ♦ సప్రవిష్టు
లగుచు నాలించుచుండి రే ♦ కాగ్రవృత్తి
నంత బ్రహ్మవాదులఁజేరి ♦యభినుతించి
తత్సభాస్థలిఁ గూర్చున్న ♦తత్క్షణమున. 16
గీ. దేవతలను గూర్చి ♦ దేవలోకముఁగూర్చి
చర్చ తీవ్రముగను ♦ సాఁగఁజొచ్చె
సంయమీంద్రు లెల్ల ♦ సంశయగ్రస్తులై
యూరకున్న మీఁద ♦ దారిలేక. 17
కం. వివదించిరి సంయములు ప
లువురొగి త్రిదివత్తు దేవ ♦ లోకంబనుచున్
బ్రవచించిరి “తిబితే” నురి
త్రివిష్టపం బగునటంచు ♦ దేవమునీంద్రుల్. 18
కం. హిమవత్ భూధ్రముకైలా
సమహీధ్రము నుత్తరించి ♦ చనఁగఁ “దిబెట్” ని
క్కమ కన్పట్టుననుచు సం
యమివర్యులు కొంతమంది ♦ యనిరటుమీఁదన్. 19
కం. కొందఱు మరుభూమికవలఁ
జెందినదేశంబని తెగఁ ♦ జెప్పిరి తుదకున్
సందడిబుట్టెను సభలోఁ
గ్రందుగ నలుమూలల నవుఁ ♦ గాదను నుడులన్. 20
గీ. వారివారించి మెలపుతో ♦ వాలఖిల్య
సంయమీంద్రులు నావంకఁ ♦ జక్కఁజూచి
"కాయసిద్ధియు దివ్యసం ♦ కల్పసిద్ధి.
కలుగువాఁడవు నీవేగి ♦ తెలిసిరము.” 21
5