Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గేయ వాఙ్మయం

87

ఈ ప్రకారముగా శ్రీ విష్ణువు యొక్క దశావతారములు వర్ణించి పాడెననియు తలుపులు విరిగిపడి దేవునిదర్శన మతనికి లభించెననియు జనులు చెప్పుకొందురు.

వివిధములు

పల్లెటూరి వారు వినోదార్థము ఎన్నియో పాటలు పాడుకొందురు. అవన్నియు సమకూర్చుట చాలా అవసరము.


“ధీరుడా జమదారుడా
మళ్లెన్న డొస్తవు నాయుడా”

అని యుల్లాసమును ప్రకటించిన పాటలు

“బండిరా పొగ బండిరా
దొరలెక్కు రైలుబండిరా
వంగిదండం పెట్టువరకు
మంగపట్నం చేరెరా”

అని రైళ్ళను గురించి పాటలను

“దిగు దిగురా నాగా
దివ్య సుందరి నాగా”

అనునట్టి పాటలను “పెరుమాళ్ళ చిన్నని”


పాటలు “బాలబాలికల” పాటలు ఇంకను నిట్టివి వేనవేలు. జానపదులలో నిలిచియున్నవి. భావకవులమని చెప్పుకొనువారు భాషాసేవ చేయదలచిన ఈ అనాదృతమైన వాఙ్మయమును పునరుద్ధరించి సంస్కరించి ఉన్నత స్థానమలంకరింప జేతురుగాక.