Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

16. బాలకృష్ణదాసు 17. శివయోగీంద్రులు, 18. తరికొండ వెంకమ్మ 19. అంగప్ప 20. చుండూరు చెన్నుదాసు 21. పోకల శేషాచలం 22. నాసీర్‌ మహమ్మద్‌ ఇతని శైలి కుదాహరణము.


“మేలుకొనుమీ తత్పదంబున
మేలుకొనుమీ త్వంపదంబున
మేలుకొనిమీ అసిపదంబున
మేదినిలో వెలినీ -
ఆత్మా - మేలుకొనవే.
వాదులాడుచు వారు వీరని
భేదముననే మోదమెరుగక
లేదు జననము లేదు మరణము
లేదు నీకెపుడూ - ఆత్మా,
చాలుపుష్పము మేలుకొమ్మని
గాలమార్యుల మూలమెరిగిన
ఫాల లోచనను విష్ణుకమలము
బోల జాలుదురే - ఆత్మా
ఇట్టి యాత్మకు నిద్రమెలుకువ
పుట్టబోదని గుట్టుదెలిపిన
గురుడు గాలిబు కరుణనాసరు
గట్టి మాటలను - ఆత్మా


ఈ తత్వాల చర్చను ముగించుటకు పూర్వమింకొక్కరి విషయము చెప్పవలసి యున్నది. రాయలసీమలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమగు “కదిరి”లోని నృసింహస్వామిని పూర్వమొక హరిజనుడు దర్శింపగోరగా పూజారులు నిరాకరించి తలుపులు తాళ మేసుకొని పోగా ఆ హరిజనులు వీరావేశము పొంది యిట్లు పాడిరట.


“బేట్రాయి సామి దేవుడా
కదిరీ నరసింహరాయుడా
కాటామరాయుడా
నన్నేలీనవాడ - బేట్రాయి”