గేయ వాఙ్మయం
85
ఏ కులమని నన్నెవరడిగిన
నేమని తెల్పుదు నీ లోకులకూ
పలుగాకులకూ - దుష్టాత్ములకూ
అని కులాలను తిరస్కరించిన మహానుభావులు.
2.దూదేకుల సిద్ధప్ప - (పింజారి) మెదకు మండలవాసుడేమో.
3. ఏగంటప్ప - పోతులూరి వారి తర్వాత దేశమంతటను ఖ్యాతిగాంచిన వాడు.
4. తోట గజేంద్రకవి - వైష్ణవ మతప్రచారకుడు. ఇతని గురించి మద్రాసు 'కళ' పత్రికలో పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రులవారు వ్రాసి యుండిరి. పాటలు మనోహరముగా నుండును.
“పుట్టుట యెల్లను గిట్టుట కొరకే
పుణ్యమేమి రాదోరన్నా!
చావక పుట్టుట జన్మదేశమున
జరుగుచు నుండుర వోరన్నా!
ఈ ప్రకారముగా బోధించినాడు.
5. అనిమ పాపయ్య 6. జ్ఞాన బ్రహ్మానందయోగి 7. వీరలింగ గురులు,
8. కంబగిరి, 9. ఇంద్రపీఠ భీమన్న 10. వర నారాయణదాసు, 11. ఆదికేశవులు,
12. చిత్తూరు నరసింహదాసు 13. పరశురామ నరసింహ దాసు 14. వీరస్వామి
15. మహ్మదు హుసేను.
ఈ మహ్మదు హుసేను శైలి కుదాహరణము.
“ఒకటి మొదలూ వృక్షము
లెక్కకు మిక్కిలి కొమ్మలురా
ఎక్కి చూచితే ఎంతో పొడవు నా
కాశమంటినదిరా
రెండు త్రోవలూ కూడిన చోట
రేపు ఒక్కటేరా
రెండు రేకులా పద్మములోపలి
అఖండ తేజమురా”