గేయ వాఙ్మయం
83
క్కత ప్రత్యేకముగా గుమారకులు
ఫీట్కా రంబునం దూలగన్.
బాలనాగమ్మ కథలో ప్రారంభమిట్లున్నది.
“కాళికి పడమట మున్నూ రామల
ఆ భూమికి ఒక చక్ర పట్నమేమి
పట్నము నేలు సహ భోజరాజా”
ఇదంతయు ద్విపదయే.
3. రాటపు పాటలు కూడ ద్విపదలోనే యున్నట్లున్నవి. శుక సప్తతిలో రాటముల
వర్ణించుచు కదిరీపతి యిట్లు వ్రాసెను.
“ప్రాయంపు పడుచుల పనిగొంటివే దూది”
“అనెడు తేనీయ పాట చినుకు లీన"
ఇందు ఉదాహృత మొదటి భాగము ఒక మాత్రా భేదముతో ద్విపదగా నున్నది.
4. ధవళాలు, సువ్వాలలు అనునవి పల్లెలో ముఖ్యముగా వివాహములలో
పాడుకొనుచుందురు. కదిరీపతి కాలములో సహితమివి చాలా ప్రాధాన్యత వహించినట్లు
కనబడుచున్నది.
“ఆ లలనా మణి కౌ గ
య్యాళి యొకానొక్కవేళ నక్కరతో సు
వ్వాలున్ శోభనములు ధవళాలున్
మొదలైన పాటలం దగనేర్చు”
అని తన శుకసప్తతిలో వర్ణించినాడు.
మేలుకొలుపులు
ఇది చాలా మనోహరమైన గానము. నిన్న మొన్నటివరకు పల్లెటూరి బళ్ళలో తెల్లవారు జాముననే బాలురు బళ్ళలో
“తెల్లవారెను మేలుకొలుపులు
అల్లనల్లన వికసె కుముదము
...... ....... ........ ........ ........
కృష్ణా మేలుకోరా......"