82
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పాటల వివరములు
తెనుగు వారు పల్లెలలో పాడుకొను పాటలు నానా విధములై యున్నవి. వారి నిత్యజీవనముతో అవి సంబంధించినవై యున్నవి. అందు కొన్ని భేదములివి.
1. ఏల పాటలు, 2. ఉయ్యాల పాటలు, 3. పెండ్లి పాటలు, 4. దసర పాటలు, 5. మేలుకొలుపులు 6. ధవళాలు, 7. సువ్వాల, 8. దంపుడు, విసురుడు పాటలు, 9. మోటపాటలు, 10. భిక్షగాండ్ల పాటలు 11. జంగం పాటలు, 12. తత్వాలు, 13. రాటము పాటలు, 14. వినోదాలు, 15. స్తోత్రాలు 16. కోలన్న పాటలు, 17. రల్లు పాటలు మున్నగునవి.
ద్విపదలు
ద్విపదలను గురించి ముఖ్యముగా చెప్పవలసినదేమన పల్లెపాటలలో ముప్పాతిక భాగము ద్విపద వాఙ్మయమే. రాగభేదములచే ద్విపదను పది పదియేను విధములుగా పాడుకొన వీలున్నది. అదేవిధముగా నేటికిని జనులు పాడుకొనుచున్నారు. ఎట్లనగా:
1. దసరా పాటలు.
“శ్రీగణాధీశాయ శివకుమారాయ”
ఇత్యాది చరణము లన్నియు ద్విపదలే.
2. జంగం కథ అనబడు తందాన కథలు విశేషముగా ద్విపదల యొక్క రూపమే.
శ్రీనాథుని వంటివాడు “పల్నాటి వీరుల సుద్దులను” ద్విపదలో వ్రాసెను. ఈ సుద్దులన్నియు ద్విపదలో వ్రాసినవే. తాళ, లయ యుక్తముగా పూర్వము నుండియు పాడుచుండినవనుటకు క్రీడాభిరామములోని ఈ పద్యమే నిదర్శనము.
ద్రుత తాళంబున వీర గుంఫిత
కథుం ధుం ధుం కటాత్కార సం
గతి వాయించుచు నాంతరాళిక యతి
గ్రామాభిరామంబుగా
యతి గూడన్ ద్విపద ప్రబంధమున
వీరానీకముం బాడెనొ