Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గేయ వాజ్మయం


దేశికవిత:

పూర్వములో దేశికవిత ప్రాముఖ్యత వహించి యుండెను. కాని నన్నయ భట్టు నుండి మార్గకవిత స్థిరపడిపోయి దేశికవిత పల్లెలలో పామర జనులలో దాగిపోయెను. మార్గకవిత సంస్కృత మర్యాదలతో రాజుల ఆస్థానములలో మురిసిపోయినది. దానిని పల్లెటూరివారు నేటివరకు కూడ ఆదరింపక శిష్టమ్మన్యులచే అనాదృతమైన ఆదేశి కవితకే ప్రాముఖ్యతనిచ్చిరి. ఈ దేశికవిత పల్లెటూరివారి పాటలలో నేటివరకును నిలిచియున్నది.

అప్పకవి విభజన:

అప్పకవి కావ్యములను ద్వివిధములుగా - ప్రబంధములనియు, చాటుప్రబంధములనియు - విభజించెను. చాటు ప్రబంధములు మరల రెండు విధములట. (1) సంఖ్యా బద్ధములనియు (2) అసంఖ్యా బద్ధములనియు. సంఖ్యాబద్ధములలో ఉదాహరణములు, ముక్తకాదులు చేరినవి. అసంఖ్యా బద్ధములో గద్య, రగడ, ద్విపద, దండకము, మంజరి చేరినవి. ఈ రెండవ భాగమందే గేయ వాఙ్మయ మిమిడియున్నది.


అప్పకవి ఛందస్సును విభజించుచు దానిని కూడ రెండు భాగములు చేసెను.

“పాద నియంమంబుగల యట్టి పద్యసమితి
వృత్తములు, జాతులను అన ద్వివిధమయ్యె
నిట నిసర్గగణంబులు వృత్తములగు
జాతు లుపగణ మాత్రల జరుగుచుండు”