Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

Jnanpith Awardee

డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ఎక్స్ ఎంపి.

Dr. C. Narayana Reddy Ex. M.P

ఎం.ఏ, పిహెచ్‌డి, డిలిట్‌.

MA., Ph.D., D.Litt.

అధ్యక్షులు

PRESIDENT

ఆంధ్ర సారస్వత పరిషత్తు

Andhra Saraswatha Parishath

తిలక్‌ రోడ్‌,

Tilak Road,

హైదరాబాదు-500001

Hyderabad - 500 001.

ఫోన్‌ : (ఆ) 24753724

Phone : (Off.) 24753724

అవతారిక

నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిస కాలంలో దాని పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ లోకనంది శంకర నారాయణరావు, శ్రీ గడియారం రామకృష్ణశర్మ వంటి సాహితీమూర్తుల ప్రేరణతో పరిషత్తు 1943 మే 26న రూపుదిద్దుకొని, ఈ రోజు తెలంగాణలో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్టస్థానం వహించింది. మాన్య మిత్రులు డా॥ దేవులపల్లి రామానుజరావుగారు యావజ్జీవం పరిషత్తు అభివృద్ధికి శ్రమించినారు. పరిషత్తు బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అందరి ప్రశంస లందుకుంటున్నది. పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద తెలుగు పరీక్షలు జరపడంతో పాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాలను, ప్రాచ్యకళాశాలను నిర్వహిస్తున్నది. పరిషత్తు ఏర్పాటు చేసే సాహితీ సభలు, సమావేశాలు, ప్రసంగాలు సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్ఠులు, పరిణతవాణి ప్రసంగాలు, ప్రసంగాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి తెలంగాణ వైశిష్ట్యానికి అద్దం పడుతున్నది. పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీలోకం అభిమానించి స్వాగతిస్తున్నది. ఇంతవరకు దాదాపు 300 గ్రంథాలను వెలువరించింది. 2013లో పరిషత్తు సప్తతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రత్యేకతలోని వివిధ పార్శ్వాలను ఆవిష్కరించే సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. నిపుణుల ప్రసంగ వ్యాసాలను “వ్యాసగుళుచ్ఛం” పేరుతో పరిషత్తు రెండు భాగాలు వెలువరించింది.