78
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అచ్చుయంత్రము లభివృద్ధియై, ఫోటో బ్లాకులు చేయుట వృద్ధియైన తర్వాత పాశ్చాత్య దేశములలో పిల్లల వాఙ్మయము అపారముగా వృద్ధియయ్యెను. సచిత్రమైన చరిత్రలు భూగోళములు, కథలు, పాటలు, విశేషములు, విచిత్రములు మున్నగు విషయములు అతి సుందరముగా ఆకర్షణీయముగా అతి సులభ భాషలో అర్ధమగునట్లు విజ్ఞానము ప్రసాదించునట్లు రచించి ముద్రించిన గ్రంథములు వేలకొలదిగా పెరిగిపోయినవి. యూరపు, అమెరికా బాలురీవిషయములో ధన్యులైనారు. అందు పెద్ద నగరాలలో ప్రత్యేకముగా బాలుర గ్రంథాలయములు, బాలుర పత్రికలు కలవు. అనేక గ్రంథ ప్రకాశక సంస్థలు బయలుదేరి బాలురకు చరిత్ర, భూగోళము సైన్సులు పరిశ్రమలు, దేశ దేశ జనులు, వారి యాచార వ్యవహార విశేషములు, మున్నగు సహస్ర విషయములను తెలుపు ముచ్చటగు గ్రంథములను ప్రచురించారు.
మన పిల్లలకు చరిత్ర భూగోళ ఖగోళములన్న తలనొప్పి కాని ఆ దేశాలలోని గ్రంథములను చూచిన వాటిపై అత్యంత ఆసక్తి ఆనందము జనించును. చరిత్ర తేదీల పంచాంగము కాదనియు భూగోళము పేరుల వరుసకాదనియు స్పష్టమగును.
పట్టు, ప్రత్తి మున్నగునవి ఆదిలో ఏ దేశము వారు కనిపెట్టిరి? ఆ చెట్లు సంఘమున కుపరికరించునట్లు చేసిరి. అన్ని విషయాలు బొమ్మలతో చిన్న చిన్న గ్రంథాలు రచించినారు. మన పట్టుభద్రులు ముప్పాతిక మందికి తెలియని విషయాలు కూడా ఆ చిట్టి పొత్తములలో గోచరించును. మన దేశములో సాధారణమైనట్టి బత్తాయ, పప్పాయ, సపోటా వంటి ఫలములు, వేరుశనగ వంటి నూనెగింజలు, మిరపవంటి ఘాటైనవి, పొగాకు వంటి విష వస్తువులు, మన దేశములోనివి కావనియు అవి అమెరికావంటి దేశాలనుండి మన దేశములో 300 ఏండ్లనుండి ప్రవేశపెట్టబడినవని ఎందరెరుగుదురు. అట్టి సహాస్రాధిక విషయాలను... సచిత్ర గ్రంథముల నుండి పాశ్చాత్య బాలురు గ్రహించగలుగుతున్నారు.
దీనినిబట్టి తేలిన విషయమేమనగా మనము ఆదిలో బాల వాఙ్మయానికి ప్రపంచానికి దారి చూపినవారము. తుదిలో పాశ్చాత్యుల నుండి మరల నూతనముగా గుణపాఠం నేర్చుకోవలసిన వారమైనాము. పాశ్చాత్య దేశములలో నూటి కించుమించు నూరుమంది చదువుకొన్నారు. మనము నూటికి 15 మందియే చదువుకొన్నవారము. కావున మన మొదటిపని నూటికి నూరుమంది విద్యావంతులగునట్లు కృషిచేయుట