74
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పంకజనాభుడు నూరెను
శంకరుడది పీల్చి పీల్చి శాభాస్ అనియెన్॥,
మంచిదినమునాడు మంగలి దొరకక
చంద్రశేఖరుండు జడలు దాల్చె
కొండియేమొ కట్టె గోపాలదేవుండు
బ్రహ్మదేవుడెన్ని పాట్లు పడెనొ!
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధపడలేక సుమీ॥
చాకివానిచేత జగడాలు పడలేక
సిరిగలాడు పట్టుచీర కట్టె
శివుడు తోలుకప్పె సీ! యని మదిరోసి
భైరవుండు చీర పారవైచె.
అన్యాపదేశ పదములను చేర్చి చమత్కరించుట ఒక హాస్యము. హైదరాబాదు
అగ్రహారికుడు తన అగ్రహార స్థితిని జంగలాత్ అధికారికి తౌరక్యాంధ్ర సంస్కృత
భాషల సమ్మేళనముతో కూడిన శ్లోకాలతో ఇట్లు మనవి చేసుకొనెను.
ఫలం లేదు మజ్కూర్ కలం బందుహాల్ సాల్
అలంమోదగాకుల్ క్వచిత్ టేకుమాకుల్
అవుర్‌కోయ కొంపల్ మరీమాల కొంపల్
హయేముళ్ళ కంపల్ హమారే గ్రహారే.
తుమారా జవానుల్ హమారే గ్రహారే
కదాపీహిదంగా సజా చేయకుండన్
హుకుందీయతాం నౌహకం చాపిదద్యాత్
ఖుదాతే ముదేస్తాత్ సదాజంగలీశ॥