తెలుగు వాఙ్మయంలో హాస్యరసము
73
ఇట్టి శబ్ద చిత్రములు కొంతవఱకు పాలకుర్కి సోమనాథునిలో కూడ కనబడుచున్నవి. చేమకూర వెంకటకవి రెండు కావ్యాలలోను కొంతవరకు హాస్యము న్ఫురించుచున్నది. కదిరీపతి తన శుకనప్తతిలో తేలికయగు హాస్యమును గ్రంథమంతటను నింపియుండుటచేత దానికి తెనుగు సాహిత్యములో ఒక విశిష్టత యేర్చడుచున్నది. రంకు కథలు కాకుండినచో శుకసప్తతి తెనుగు వాఙ్మయములో అగ్రస్థానము వహించి యుండెడిది. శ్రీనాథునిలో అందందు హాస్యము కానవచ్చును. కాని విశేష భాగము పచ్చి శృంగారమే. బువ్వపు బంతి మున్నగు శృంగార నైషధ ఘట్టములట్టివే, వల్లభరాయని క్రీడాభిరామములోను ఇదే అవస్థ, కోళ్ళ పందెములోను, పొట్టేళ్ళ పందెములోను చచ్చినవాటికై కవి విలపించి శ్రోతల నవ్వించిన భాగాలు అందముగా నున్నవి.
జగ్గకవి తన చంద్రరేఖా విలాపమును హాస్యరస ప్రబంధరాజము అని వర్ణించుకొనెను. కాని గ్రంథమంతయు పచ్చిబూతులతో నిండినది.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకునవ్వు పుట్టదు ధరలో
అన్న కవిచౌడప్ప ఇతని కాదర్శకవిగా కనబడుచున్నాడు. కాని
పదినీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యములు
చౌడప్ప వ్రాసెను. ఇందునీతులే లేవు. అందుచేత అచ్చన బుచ్చనలోపల అచ్చనయే
మేలు అన్నట్లు చౌడప్పయే మేలు రకమువాడు.
ఇక మరొక్కని గూర్చి ప్రశంసింపవలసి యున్నది. అతడు వేమన. అతని
పద్యాలలో నీతులును, హాస్యమున్నూ మేళవించి యున్నవి. అతని పద్యాలలోనూ
కొన్ని బూతుపద్యాలు ఉన్నవి. అట్టివి అతని పేరుతో స్వార్థులు రచించినట్లున్నది.
చాటువులలో మంచి హాస్యమున్నది. హాస్యరసమును గ్రోలదలచిన వారు చాటువులను
చదువవలయును కొన్ని యుదహరింతును -
లంక పొగాకును తెచ్చియు
పొంకముగా సున్నమేసి పొడిచేసిరయా