తెలుగు వాఙ్మయంలో హాస్యరసము
71
(బీర్బల్) గోదావరి డెల్టాలో పుట్టి పెరిగిన తెనుగువాడని చాలామందికి తెలియనే తెలియదు. ఇట్లుండినను తెలుగు సాహిత్యములో హాస్యసము విరివిగా కానరాకుండుట యెందులకు? పలువురు తెనుగు విద్వాంసులు హాస్యమంటే పచ్చి శృంగారమని భాణములను చూచి భ్రమపడిరి. అందుచేతనే తెనుగు సాహిత్యములో శృంగారాతిశయ వర్ణనలందును, జుగుప్సా వర్ణనలందును హాస్యమును సాధింపజూచినారు.
శతక వాఙ్మయములో హాస్యము కొంతవరకు కనపడుతున్నది. చంద్రశేఖర శతకము ముఖ్యముగా పేర్కొనదగినది. కాని దాని కర్త యెవరో తెలియదు. భాష నెల్లూరి యాస. రామలింగేశ శతకములోను, కుక్కటేశ్వర శతకములోను కొన్ని మంచి భాగాలు కలవు. వేణుగోపాల శతకము బాగున్నది. కాని తత్కర్త తిట్టనిది నవ్వింపలేడు. కవి చౌడప్ప సరేసరి. పుస్తకమంతా బూతుల బుంగయే. భాషీయ దండకము 200 ఏండ్ల నాటిది. కర్నూలు జిల్లా భాష అందు కలదు. అది బాగానే యున్నది.
ఇక పురాణ ప్రబంధాలను గురించి విచారింతము. పురాణాలు సంస్కృతము నుండి పరివర్తనము చేయబడినట్టి ఇతిహాసాదికములు. అందు హాస్య రసమునకు తావు లేదు. అయినను మన తెనుగు భారతములో అందందు మూలములో లేనట్టి హాస్య రసమును తిక్కన సోమయాజిగారు పోషించినారు. కీచకుని చంపుటకై ద్రౌపదికి మారుగా నర్తనశాలలో చీకటిలో భీముడు కాచుకొనియున్నాడు. కీచకుడు కామావేశముతో ద్రౌపదియే అందు కలదని తన కామ వికారమును ప్రకటించుకొనును. అప్పుడు భీముడిట్లనును.
ఇట్టివాడవు కావున నీవు నిన్ను
బొగడికొనదగు నకట నా పోల్కియాడు
దాని వెదకియు నెయ్యడనైన నీకు
బడయ వచ్చునె యెఱుగక పలికితిట్లు.
నా యొడలు సేర్చి నప్పుడ
నీ యొడ లెట్లగునొ దాని నీ వెరిగెదు న
న్నే యబలల తోడిదిగా
జేయదలంచితివి తప్పు సేసితి గంటే.