Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వాఙ్మయంలో హాస్యరసము

నవరసములలో హాస్యరసమొకటియని భరతుని కాలమునుండియు ఆలంకారికులందరున్నూ అంగీకరించినారు. హాస్యమన నేమియో అందరెఱుగుదురు.

“సచ వికృతపరవేషాలంకార దార్ష్ట్య లౌల్య కుహకాసత్ర్పలాప వ్యంగ్య దర్శన దోషోదాహరణాదిభిర్విభావై రుత్పద్యతే”. అది ఆరువిధాలు. 1. స్మితం, 2. హసితం, 3. విహసితం, 4. ఉపహసితం, 5. అపహసితం 6. అతిహసితం అని ఇతరులను అనుసరించుట, వికృతముగా నాచరించుట, వ్యంగ్యముగా సంభాషించుట, పరదోషముల హేళనము చేయుట ఇట్టివన్నియు హాస్యమనబడును.

సంస్కృత వాఙ్మయములోనే హాస్యరసము తక్కువ. అది కావ్యాలలో పరిశోధించితే కాని కనబడదు. నాటకాలలో హాస్యానికిగాను విదూషకుని ప్రత్యేకముగా సృష్టించిరి. కాని వాడెల్లప్పుడును తిండిపోతు బాపడై యుండెను. భాణములలో హాస్యమును ప్రధానముగా పోషించదలచిరి. కాని యదంతయు పచ్చి బూతుల పంచాంగముగా పరిణమించెను. చాటువులలోను బూతులను వదలితే మిగిలిన హాస్యము తక్కువే.

ఇదే మర్యాద తెనుగునకునూ వర్తించునని స్థూలముగా చెప్పవచ్చును. తెనుగు ప్రబంధాలలోను పురాణాలలోను హాస్యము చాలా తక్కువ. నాటకాలు నిన్న మొన్నటివరకు లేకపోయెను. వాటికి బదులుగా శతకాలు వ్రాసిరి. అందులో కొన్నిటియందు హాస్యరసము కనబడుచున్నది. చాటువులలోనే యెక్కువగా హాస్యరసము నిండియున్నది.

హాస్యానికి తెనుగువారు ప్రసిద్ధి. తెనాలి రామలింగడు జగద్విఖ్యాతుడు. మర్యాద రామన్న కూడా తెనుగువాడేమో? అక్బరు చక్రవర్తి విదూషకుడై యుండిన వీరబలుడు