ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము
67
ఖుతుబుషా వంశము వారు తెనుగు దేశములో చెరువులు కట్టించిరి. అనేక గ్రామాలను నిర్మించిరి. ఇతర ప్రాంతాల నుండి సమర్ధులను పిలిపించి, వారికి జాగీరులిచ్చి క్రొత్త గ్రామాలను స్థాపింపచేసిరి. అట్టివారిలో దోమకొండ ప్రభువుల పూర్వీకులు ముఖ్యులు. రాజా మల్లారెడ్డి తన 'శివ ధర్మోత్తరమున' నిట్లు వ్రాసుకొనెను.
“ఘనుడా కాచనృపాల శేఖరుడు మున్ కర్ణాట రాజ్యంబు నం
దున దుర్గాధిపతిత్వ వైభవముతోడ్తో కాంచి సుల్తాను పి
ల్పున కృష్ణానది దాటి యా, మెదకు, బల్ దుర్గంబు క్రిందన్ జిరం
తనమౌ బిక్కనవోలునుండె నవి యాత్మస్థాన రాజంబుగన్”.
ఈ సంఘటన ఇబ్రహీం తర్వాతి వాడగు మహమ్మద్ కుతుబుషా కాలంలో
అనగా 1612 క్రీ.శ.లోని మాట. ఆ మహమ్మద్ ఖుతుబుషా దోమకొండ పూర్వ
ప్రభువులను చాలా గౌరవించెను.
“భవ్య సులతాను మహమదు పాదుషాహా
లబ్ధ భూషణ లలిత పల్యంకితాత
పత్ర చామర సామ్రాజ్య భరిత విభవ
రమ్య గుణశాలి శ్రీ కామరడ్డి మౌళి”.
రాజా మల్లారెడ్డి గొప్ప కవి. సంస్కృతాంధ్రములందు అద్వితీయ పాండితీ
ప్రతిభను తన కవనమందు ప్రకాశింపజేసినాడు. అతడొక చాటువులో తాను ఖుతుబుషా
ప్రభువుల కాస్థాన కవినని చెప్పుకొనెను. మల్లారెడ్డి సమకాలికుడైన గణనాథ కవి
యను నతడు గొప్ప “సత్కవి” యనియు, అతని తండ్రి పండిత వరేణ్యుడనియు
మల్లారెడ్డి తన పద్మ పురాణములో వ్రాసినాడు. అట్టి గణనాథ కవి ఖుతుబుషా
(అనగా 1617లో) ఆస్థాన కవిగా నుండెననియు తెలిపియున్నాడు.
“ధీనిధి, సాహితీయుతు, ప్రతీతయశున్ కుతుపావనీశ్వరా
స్థాన మహాకవీంద్రు, నిజ దర్శన కౌతుక వైభవాగతున్
శ్రీ నరసింహ పండిత వరేణ్యకుమారు గణేశధీరు స
మ్మానముతో నెదుర్కొని నమస్కృతి జేసి వసింప జేయుచున్”
ఇట్టి “మహా కవీంద్రుడైన” గణనాథ కవిని గురించి మనకింతకంటే ఎక్కువగా
తెలియకపోవుట సంతాపకరము. అతడు “కుతుపావనీశ్వరాస్థాన కవీంద్రుడు”. కాని