Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర

59

లందు రచనలు చేసిరి. రఘునాథ రాజు స్వయముగా మహా పండితుడు; ఉత్తమకవి. సంగీతములో కొత్త రాగములను కనిపెట్టి ప్రచారము చేసినాడు. అప్రతిహత వీరుడు. ఈతడు రచించిన బహు సంస్కృతాంధ్ర గ్రంథములు లభించినవి కావు. వాల్మీకి చరిత్ర మనునదొక్కటి ముద్రితమైనది. అది యుత్తమ శ్రేణిలో చేరిన గ్రంథము.

రఘునాథ నాయకుని ఆస్థానకవి చేమకూర వేంకటపతి, “ఈ చేమకూర చక్కెర మడిలో అమృతము పాఱించి పెట్టినది” అని శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారనిరి. ఈ చేమకూర వెంకటపతి సారంగధర చరిత్రము, విజయవిలాసము అను రెండు ప్రబంధములను రచించెను. ఈ రెండును ఆంధ్ర సారస్వతమందు అమూల్యమగు రత్నములు.

విజయ రాఘవుని కాలములో ఉత్తమ కావ్యాలు వెలవడలేదు. కాని పలువురు స్త్రీ పురుషులు యక్షగానాలను, చరిత్రలను మున్నగు వాటిని రచించిరి. అందు రంగాజమ్మ మన్నారు దాస విలాసము ముఖ్యమైనది. కాళకవి, వేంకటపతి సోమయాజి యనువారును ప్రబంధాలు వ్రాసిరి.

మధుర రాజులు

తంజావూరు రాజులెట్టు విజయనగరానికి యుండిరో అటులే మధుర నాయకులును అదే కాలములో సామంతులై తర్వాత స్వతంత్రులై యించుమించు తంజావూరు పడిపోయినప్పుడే పడిపోయిరి.

వారి కాలములో కొందరు సాధారణ ప్రబంధాలు వ్రాసిరి. అందులో ముఖ్యుడు శేషము వేంకటపతి తారాశశాంకము వేంకటకృష్ణప్ప నాయకుడు అహల్యా సంక్రందనమును వ్రాసెను. అతడే జైమినీ భారతమును వచనముగా వ్రాసెను. మట్ల అనంత భూపాలుడు, విజయరంగ చొక్కనాథుడును ప్రబంధాలు రచించిరి. వీరిలో శేషము వేంకటపతి తారాశశాంకము చక్కని శైలిగలది.

6. సంధి యుగము

విజయనగర పతనానంతరము చిల్లర పాలెగాళ్ళను, ధనికులను ఆశ్రయించి పలువురు కవులు రచనలు చేసిరి. వారినే యుగములోను చేర్చుటకు వీలు లేనందునను వారు మన ఆధునిక యుగానికి పూర్వులయినందునను క్రీ.శ. 1700-1900