54
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్య లభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాతపత్ర ధృతియో, బ్రాగ్దీపికారోపమో
నృహరీ! వాదములేల? లేరెయితరుల్ నీ లీలకుం బాత్రముల్”
- ఆముక్త మాల్యద
“బహురత్నద్యుతి మేదురోదర దరీభాగంబులం బొల్చుని
మ్మిహికాహార్యమునం జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబులవి మత్కాంతార సంతాపముల్”
- మనుచరిత్ర
ఏ పద్యము చూచినను రెంటిలో ఇట్టి శైలి భేదముండును - కాన శ్రీకృష్ణరాయలే
ఆముక్త మాల్యదను రచించెనని విశ్వసింపవలెను. బ్రాహ్మణేతరుల కవిత్వమెంత
మంచిదైనను అది కాకజుష్టంబైన హవ్యంబువోలె గ్రాహ్యంబు కాదు” అని తిట్టిన
అప్పకవి తన అప్పకవీయములో ఆముక్తమాల్యదను ఉదాహరించిపుడంతయు అది
పెద్దన్నగారిది అని వ్రాసెను. అక్కడనుండి ఈ కథకు వేళ్ళు వచ్చెను. ఆముక్త మాల్యదను
విష్ణు చిత్తీయమనియు నందురు. శైలి బాగుగా లేకున్నను అందలి భావములు వర్ణనలు
అనితర కావ్య లభ్యములు.
కృష్ణదేవరాయలకు ముఖ్యుడైన ఆస్థాన కవి అల్లసాని పెద్దన. అతనికి “ఆంధ్ర కవితాపితామహ” అను బిరుదమిచ్చి అతని కాలికి ఆ చక్రవర్తి స్వయముగా గండపెండేరమును తొడిగించెను. శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన తర్వాత అల్లసాని పెద్దన అతనిని తలచుకొని వాపోయిన పద్యమును చదువు ఆంధ్రులు కూడ ఆనాటి వైభవమును తలచుకొని దుఃఖింపక మానరు. పెద్దన రాయల గూర్చి ఇట్లు విలపించెను.
“ఎదురైనచో దన మద కరీంద్రము డిగ్గి
కేలూత యొసగి యెక్కించు కొనియె
మను చరిత్రంబందు కొనువేళ పురమేగ
పల్లకి తనకేల బట్టి యెత్తి