Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

అవసరం వచ్చిననాడు వారు వెళ్ళక మానరు. వారి వెంట వేలకొలది అనుసరించక మానరు. వారిలో అంతటి విశ్వాసం జనులకు కలదు.


ఎద్దుంచ పోయంగ ఏరులై పారంగ
ఉంకించి ఉంకించి దుంకినాడు

అన్న విధంగా 'చూడు నా దెబ్బ' అని మీసం పురిపెట్టి, భుజమెప్పళించి రంకె వేసి సవాల్‌ వేసేవారు కారు శ్రీ రెడ్డిగారు.

స్వయంకృషి వల్ల వృద్ధికి వచ్చినారు. ఒకరికి అపకారము చేసి ఎరుగరు. వివాదాలకు దిగరు. ఎంత అంటారో అంత చేస్తారు.