కొండా వెంకట రంగారెడ్డిగారు
399
బూర్గులవారు మంచి వక్త అని అంటే దోషం లేదు. మాడపాటివారు ముద్దుముద్దుగా మాట్లాడుతారు. ప్రతాపరెడ్డిగారు మీదికే ఉరికి వస్తారు. రావి మిత్రము ఒకటి తలచి ఒకటి అంటాడు. మందుముల సోదరులు మూల్గుతారు. వారికి ఎడమచేయిగా కొండావారు ఉంటారు.
ఇంతవరకు మదింపు చేస్తే ఏమి తేలినట్లు? కొండకు ఇంగ్లీషు రాదు. తెనుగు బాగా రాదు. గొప్ప వక్త కాడు. అట్లయితే ఇంకెందున్నది ఆయన గొప్పతనం. ఈ కాలంలో రంగం యెక్కి ఏకధాటిగా జడివానవలె ఉపన్యాసం విసరేవారే గొప్పవారు. ఏదో ఒకరాగం అలవాటు చేసుకొని గొంతెత్తి పాడేవారే కవిత్వ కోకిలలు. చతురాంగ్లాక్షరాతీత బిరుదలాంగూల విభ్రాజమానులే పండితమానులు. నేను సర్వజ్ఞుని అనే వాలకంతో నోరెత్తితినా జాగ్రత్త అనే బెదరింపుతో మాననష్టం దావాకు భయపడ కుండా వాదాన్ని వదలి ప్రతిపక్షులను సంస్కృత వ్యంగ్య ధ్వనులతో సత్కరించేవారే విమర్శకాగ్రేసర చక్రవర్తులు. మరి వేంకటరంగారెడ్డి గారు ధ్వన్యాలోకం చదువు కొన్నారా? అదికూడా లేదా శాంతం పాపం. వారికి “వక్రోక్తి జీవితము” సరిపడనే సరిపడదు.
మరెందున్నదండి వారి గొప్పతనం. ఏదో విసిగించకుండా రెండు ముక్కలతో చెప్పివేయండి అని అంటారా వినండి.
మా కొండ వేంకటరంగారెడ్డిగారి వంటి వకీళ్ళు మొత్తం హైద్రాబాదు రాజ్యంలో యిద్దరో ముగ్గురో అంతే! వారి కాదాయం నెలకు 1000 రూపాయిలే. సర్ సప్రూకు నెలకు 20 వేలట. మోతీలాల్ నెహ్రూకు నెలకు 50 వేలు వచ్చేదట. 1000 రూ॥ వకీలు గొప్ప వకీలెట్లామరి. హైద్రాబాదులో నెలకు 10 వేలు సంపాదించే వకీళ్లు కొందరున్నారు. కొందరు కక్షీదారులు న్యాయాధిపతిగారి అల్లుడు, చుట్టము, మిత్రుడు యవరయ్యా అని విచారించుకొని అతనికి కోరిన ఫేసు'ను ఇచ్చి కోర్టులో దిష్టిబొమ్మవలె నిలబెట్టుతారని వింటూ ఉంటాము. తాలూకాలో కొత్త మున్సిపులను బండెడు పుస్తకాలతో, మేకచెవుల మెడ పట్టీలతో, 'అబద్ధంవా సుబద్ధంవా కుంతీపుత్రో వినాయకః' అను దబాయింపు వైతండిక వాదముతో కేసులో గెలుపును పొందే వకీళ్ళు కొందరు, చీమతలంత ఆనుకూల్యము లేకున్నను ఫీసు నష్టం కాకుండా నీ కేసును