386
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వక్తృత్వ పరీక్షలో బహుమానం పొందిన వక్త కాడు. గొప్ప పండితుడును కాడు. కవిత్వము చిన్నప్పు డేవో గణబద్ధముగా వ్రాసిన కొన్ని పద్యములు కలవు. పరిశోధకులకు తప్ప నితరులకాసంగతి తెలియదు ఇంగ్లీషులో మెట్రిక్కు హద్దు. ఫార్సీలో సాదీని సాధించెను. ఉర్దూలో మంచి పాండిత్యము. తెనుగులో గ్రాంథికవాది. కాని గ్రాంధిక వ్యావహారిక చర్చలో తమ విలువ వోటు నెవ్వరికి ఇయ్యరు. ఇతిహాసకుడు కాడు, పరిశోధకుడు మున్నేకాడు. అయితే యిన్ని “నఞ్"లతో ఒప్పియు వీరికీ ప్రాముఖ్య మెట్లువచ్చెను? అదియే వీరి జీవిత రహస్యము.
♦ ♦ ♦
శ్రీ పంతుల వారికి చేపట్టిన విషయములందెల్ల పట్టుదల మెండు. కార్యసాధకుడు. (ప్రజోపయోగార్థమై యా సాధన మరుదుగా యేనకేనా ప్యుపాయేన అయిననూ సాధారణముగా నియమోల్లంఘన మభిలషించరు)
ఏ విషయమును గురించి ముచ్చటించినను - సభలో గానీ, ఇంటిలోగాని ఆ విషయమును విపులీకరించి, తిన్నగా, నెమ్మదిగా, కథాక్రమముగా, పూసగుచ్చినట్లు విషయము పెరిగినను సరే, శ్రోతల కానందముండునంతవరకు సాగదీయును.
♦ ♦ ♦
ఎవ్వరి మనస్సును గాని, ఏ కారణమునైనగాని, నొప్పింపగూడదనునది వారి నీతి మార్గములలో రాజమార్గము. “అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు” అని యీనాడే రాష్ట్ర కవియైన వ్రాసియుండిన అది వీరిని మనసులో నుంచుకొనియే వ్రాసినాడేమోయని మిత్రులందరిలో గుసగుసలు బయలుదేరి యుండును. ఎవ్వరేని రావుగారి అభిప్రాయము గోరిన వారికి మనసిచ్చి చెప్పరు. “పుత్రోనుపుత్రి" వంటి జోస్యముగా నుండును. అభిప్రాయభేదమును విధిలేక ప్రకటింపవలసియే యుండిన అది ద్రావిడ ప్రాణాయామ న్యాయముచే సిద్ధింపజేతురు.
♦ ♦ ♦
నాయకుడైన వానికి ఒకానొక సమయములో శీఘ్ర నిర్ణయము (Quick decissi0n) ఉండవలెను. వీరు తరచుగా వికల్ప న్యాయములో జిక్కియుందురు.
నాయకుడు సమయమునకై పొంచియుండవలెను. సమయము వచ్చినప్పుడు దానిని తటాలున గ్రహించి లాభము పొందవలెను.