Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

ఆముక్తమాల్యదలో పై యభిప్రాయము నిచ్చు నీ క్రింది పద్యము మొదట మనకు మతికి వచ్చును.


తన యుదరంబునం బొడమి తామ్రరుచిచ్చట లుల్లసిల్ల గో,
ల్కొనుధరణీజ సంతతికింగోరక దంతములించుకంత, ని
క్కినయది యాదిగాగ జెలగెన్‌ వనలక్ష్మి కడుంజెలంగగా
జను బ్రియుడైన మాధవుని సంగతిమీదట జాల గల్గుటన్‌.

ఆము. (5-116)


ప్రసవానంతరము కన్న శిశువునకు తొలి రెండు పండ్లు మొలచిన తర్వాత భార్యాభర్తల పునస్సమాగమ కాలమని హిందువులలో శిష్టాచారమైనది. ఒక యిల్లాలు తాను పతి సంభోగ సుఖానుభవ యోగ్యతను పొందినదని తన పతికి సుకుమారముగా నెచ్చరిస్తున్నది. దానికి సాక్ష్యమేమి? ఇదిగో పలుకాటుల పడిన రేగుపండు. అదెక్కడున్నది. ఇదిగో యిప్పుడే నీ చేత నుంచుచున్నాను. అయితే భార్య “ప్రహసిత వదన”గా రేగుపండును తన భర్త సేత నెందుకుంచెను? అది అనుమానానికి తావిచ్చునని సరస్వతీ కంఠాభరణమందు “వికసితనయనా” యని కలదు. అప్పుడు భావము సుందర తరమగును. కాని ప్రహసిత వదనయను పదముపై తృతీయ పంథగా వ్యాఖ్యలు చేయునలవాటు పడిన గంగాధరుడిట్లంటున్నాడు. “యువతి కుమారునికి పండ్లు వచ్చువరకు తాళజాలనిదై తానే దంత యుగళాంకితము చేసి రేగుపంటిని భర్తకిచ్చినది. అందుచేతనే మగడు నమ్మడని ప్రహసిత వదనయైనది” ఇదే ధోరణిలో నాలోచించిన మనమింకను నిట్లన వచ్చును. ప్రత్యక్ష ప్రమాణముండగా అనుమాన ప్రమాణమేల? చిట్టివాని కొత్త చిరుపండ్లు చూడుమాయని శిశువు నోట భర్త వ్రేలిని పెట్టించి కొరికించి తామును నవ్వవచ్చును. శిశువునూ నవ్వించవచ్చును. అట్లు చేయక పిల్లవానిపండ్లు చూపించక రేగుపండుపై కాట్లను చూపింపనవసరమేమి? ఇది ఇట్లుండనిండు. రేగుపండునే కొరికించి చూపనేల? వేరు మెత్తని చిన్నపండు - ద్రాక్షవంటిది బాగుండదా? నాకిట్లు తోచినది. రేగుపండు వసంతాగమ కాలమందు సమృద్ధి. అందుచే కవి దానిని సూచించెనేమో. మరియు ఇతర భారతీయులలో యే ప్రాంతమందు కలదో లేదో కాని తెనుగునాటనొక యాచారము కలదు. సంక్రాంతి పండుగనాడు ఏడాదిలోపలి శిశువులను కూర్చొనబెట్టి వారి తలలపై నుండి రేగుపండ్లను