పానగల్లు కోట
365
కూడా లేదు. కోట క్రింద యూరు వృద్ధియై ఇంచుమించు అయిదారు నూర్ల యిండ్లున్నవి. ఇప్పుడు కోటలో కొన్ని యెకరాల భూమి సేద్యమగుచున్నది. ఈ గట్టు నాశ్రయించియే గ్రామము కలదు. కోటకు ముందు భాగము చాలా యెత్తు కలదు. కాని దాని వెనుక భాగములో కోట మీదికి బండ్లు బాగా పోవు దారి కలదు. వ్యవసాయదారులు కూడా దారినే యుపయోగించుదురు.
కోటకు మొత్తం 52 బురుజులుండెనందురు. మూడు అంతర్దుర్గాలు నిర్మించి వాటి చుట్టును కందకములు త్రవ్వి నీరు నించి యుండినట్లు కానవచ్చుచున్నది. ఇప్పుడు పానగల్లు గ్రామములో ఒక నాకా యున్నది. అక్కడ ఒక పోలీసు అమీనున్నాడు. కోట కావలికి ఇద్దరు ముగ్గురు కావలి వారు నియమితులైనారు. వారు విశేషముగా రాత్రులందు కోటలో పండుకొందురని యందురు. ఇక కోట నెవరు నిర్మించిరి? దాని చరిత్రయేమి? అను విషయము విచారణీయమగును. దానిని సరిగా తెలుపుటకు వీలు లేకున్నది. వీలైనంత వరకు ఊహించి తెలుపవచ్చును.
ఈ కోట చరిత్ర కాధారములు దానిలో నుండు శాసనములే. కోటకు పై భాగములో ఒక శాసనము బయటి గుండుపై నున్నది. అది సరిగా చదువుటకు వీలు లేదు. అక్షరాలు మాసిపోయినవి. దాని ప్రక్కననే ప్రవేశద్వారము (గవిని వాకిలి) కలదు. ఆ ద్వారములో కుడి ప్రక్కన అరుగులో నుండు పెద్ద ఇసుక రాతిపై నొక శాసనమున్నది. బయటి శాసనానికిని దీనికిన భేదము కానరాదు. రెండును సంస్కృత శాసనాలు. ఈ శాసనమును చదువవచ్చును కాని దాని వద్దనే కావలి కాయువారు నిరంతరము సెగడును (నిప్పు కొరవి) మండించుచుండుటచే శాసనము పొగచూరి నిలువున సగము పగిలినది. అచ్చట మంట చేయుకుండుటకై అధికారులు వెంటనే ఆజ్ఞ యిచ్చి శాసనమును కడిగించి శుభ్రముగా నుంచునట్లు చేయవలెను. ఆ శాననములో తుది భాగమందు ఇమ్మడి బుక్కరాయలు అను అక్షరాలు కనిపించుచున్నవి. అందుచేత అది విజయనగర రాజుల కాలము నాటిదని ఊహింపవీలగుచున్నది. కోట లోపల పెద్ద బయలున్నది. అందొక చోట ఆరు స్తంభాలు వాటిపై అడ్డ దూలాలు నిలచినవి. వాటి ముందు కొంత దూరములో రెండు స్తంభాలు కలవు. వాటిపై బుద్దుని విగ్రహము రెండు ప్రక్కల కడపరాయి కలదు. ఆ స్తంభాలను లంజ ఉయ్యల అని యందురు. కారణమేనమగా పూర్వమొక రాజు యొక్క లంజ ఆ