360
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
క్షేత్రాలు, వాటి నాశ్రయించిన గ్రామాలు, దేవాలయ శిఖరాలు, చుట్టునుండు గట్లు, వాటిపై నుండు చెట్లు ఇవన్నియు ఒక చక్కని దృశ్యమును కలిగించి మరుపురాని స్మృతిగా మనస్సులో నిలిచిపోవును.
ఇదే స్థలమందు నిజాం ఇంగ్లీషు ప్రభుత్వాలు చేతులు కలిపి నది కడ్డముగా ఆనకట్టవేసి కాలువలను తీయుటకై సంకల్పించినారు. పది పదిహేను ఏండ్లనాడే ప్లానులన్నీ సిద్ధముచేసి యుంచినారు. యుద్ధానంతరము చేయుచున్న కార్యాలలో ఇచ్చటి ఆనకట్ట యొకటియై యున్నది. ఈ పంచేశ్వరములోని ఒక క్షేత్రమగు సోమేశ్వరమును సోమశిల అనియు అందురు. అచ్చట హైద్రాబాదు వారి సుంకము ఠాణా యొకటి కలదు. సోమశిల మల్లేశ్వరానికి ఒక మైలు దూరములో కలదు. మల్లేశ్వరము కొల్లాపురము వారిది. సోమేశ్వరము నాగర కర్నూలు తాలూకా లోనిది ఈ రెండును కొల్లాపురానికి 7 మైళ్ళ దూరములోను కొల్లాపుర సంస్థానములోని దగు పెంట్లవెల్లికి 6 మైళ్ళ దూరములోను కలవు. బాటలు మాత్రము చాలా అధ్వాన్నముగా ఉన్నవి. ఆ ప్రాచీన క్షేత్రాలకు పెంట్లవెల్లి నుండి పోవుదారినైనను బాగు చేయించుట సంస్థానం వారికి తప్పని ధర్మమని తలంతును.
ఇక క్షేత్ర విశేషాలను గూర్చి వ్రాయుదును. వనపర్తి రోడ్డు స్టేషనులో దిగవలెను. అక్కడినుండి కొల్లాపురం పోవు బస్సులో వెళ్ళి పెంట్లవెల్లి స్టేజిలో దిగవలెను. అక్కడ బాడుగ బండ్లు దొరుకును. అక్కడి నుండి 6 మైళ్ళ దూరాన నున్న మల్లేశ్వరములో ప్రధాన దేవాలయమ యేటి గట్టుననే కలదు. దానిలో మూడు శాసనాలున్నవి. ఒక శాసనముపై తైర్థికులు చెట్నీ నూరుకొంటూ వచ్చినందున అది ముప్పాతిక అరిగిపోయినది. తక్కిన రెండున్నూ అరిగినవి. మట్టితో నిండినవి కానవచ్చు లిపి స్వరూపాన్ని బట్టి అవి చాళుక్యుల శాసనాలని స్పష్టమగును. ఇంతవరకీ శాసనాల ప్రతులును తీసి ప్రకటించినట్లు కానరాలేదు. అతివృష్టి కాలములందు కృష్ణవేణమ్మ కూడా ఈ దేవాలయావరణము లోనికి వచ్చి శివుని పలుకరించి పోవును. ఆమె ఆగమన ఫలితముగా దేవాలయము ఒక గజము లోతు వుండుటచే నిండినది. అందందు పగళ్ళు మొదలై ఆలయ భాగాలు పడిపోవుచున్నవి. కొన్ని ఆవరణ విగ్రహాలు సుందరముగా నున్నవి. దేవాలయమునకు కొద్ది దూరమందే రెండు చిన్న గుళ్ళమిట్టపై నున్నవి. అందొక దానిలో శేషశాయి కలదు. శివక్షేత్రములో వీరెట్లు ప్రవేశము కల్పించు