గాథా సప్తశతి
35
'మగని పయనమన్న మాటెవ్వడాడెనో
వానిమనసుపాడుగాను; తాను
విన్న మొదలు విసముగొన్నట్లు కోడలి
యవయవంబు లెల్ల నయవసాగె (2-11)
సవతిని నిందపాలు చేయుటకో లేక యున్నంత తెలుపుటకో దాని సవతి పై
విధముగానన్నది. సవతి జారుడు పనిపై ప్రవాసము వెళ్ళుచున్నాడని దానికెట్లో
తెలియకుండునా. తెలియనే తెలిసినదమ్మా! ఇక చూడు, అప్పటినుండి మొగము
చిట్లించుకొని రుసరుసమని ఇంటి పనులన్నియు అడ్డదిడ్డిగా చెడజేయుచున్నది.
దానికావార్త విసమునాకినట్లు కసిబిసియైనది. ఇంత విచ్చలవిడి తగునమ్మా? అని
సవతి పోరొకదిక్కు
దీనికింకొక కథ కూడ సాధ్యమైనది. ఏమనగా - పతి ప్రవాస మందున్నందున ఆ సుందరిని నాకు కూర్పుమని యెకలంపటవిటుడు తార్పుకత్తెను విచారింపగా నాదూతి యిట్లంటున్నది. “వయ్యారపు అయ్యవారూ! ఆ యువతి పతి వియోగముచే దుఃఖతయై యింటి పనులే చేయనొల్లదే, అంతటి పతిదత్తమానస నీకు చిక్కునా? అది వ్యర్థ ప్రయత్నము” అని మందలించుట యిందు ద్యోతకమైనది.
అయితే మరొక విస్పష్టభావము పైననే కానవస్తున్నది. అత్తగారు తానెంతగా గట్టిగా కోడలి నెత్తిన మిరియాలు నూరినను, తన కొడుకు ప్రవాసమున కేగనున్నాడని కన్నకడుపు కావున తానాయసపడినదై తన కోడలి విరహతాపముపై కరుణ కలిగి ఇరుగుపొరుగు అమ్మలక్కలతో వెల్లడించుకొను వరకు మనసు పట్టలేకపోయినది. అత్త యిట్లన్నది. “నా కోడలికి దాని మగని ప్రవాస వార్త యెవరు చెప్పిరో యేమోనమ్మా విన్నప్పటినుండి మొగమింత చేసుకొని యింటిపనులన్నీ ముట్టక దుఃఖముతో బాధపడుతుందమ్మా- నా కోడలు!”
మరొక గీతమును తిలకించండి.
“ముద్దు కొడుకు మొదట మొలచిన పలుదోయి
గొరికి కొరికి కాటు వరిచెనిదిగొ
రేగుపండు గంటిరే! యని పెండ్లాము
నగుచు దెచ్చి పెట్టె మగనిచేత. (2-100)