Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొల్లకొండయే గోలకొండ

347

విచారించగా మరుషతుతో కొండయ్య చేసె మారుజా ఇదికదా! పన్నెండు గొల్ల కులాలకు రెండు కురుమ కులాలకు నేను గురువును యాదవ పీఠానికి అధికారివలె మానుగలుగు ఎప్పటికి గోలకొండ అనే పేరువుంచేది. గొల్లకొండ అని అనవలసినది. మా పరంపర రాబడిన 1465 సంవత్సరముల నుండి జరుగుకుంటు వచ్చిన వరంగల్‌ ప్రతాపరుద్ర మహారాజు ఇచ్చిన సనదు చూచుక అదే మతాబకు మొహరు దస్తకతుతో మాకు సనదు ఇచ్చేది. ఇదికాక గొల్లవాండ్లకు కురుమవాండ్లకు కూనిచేయకూడదు. అగరు కూని చేసినట్టు ఆవుతె గద్దికి హతకు వస్తాది. అదే తక్షణం లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇదిగాక కిలాలోపట యున్న యల్లమ్మ ఒకటికిలా బయటయున్న మల్లన్న మఠము, ఇవి యావత్తు వున్నంత దూరము దోషావరు జమీను ఇవి మావిగా వుండె అట్టి హుకుం ఇవ్వవలసినది. ఆదిగాక ప్రతాపరుద్ర మహారాజు ఇచ్చిన 1465 బిరుదావళి మర్తబా కితాబు ఏమనగా మా యాదవ పీఠము వెంట యాదవులున్ను యెలిగొలచి మహమ్మదీయులున్ను స్వామి కార్య దురంధరులున్ను దేవబ్రాహ్మన భయభక్తి పరులున్న పదునూట సహోదర రాజులున్న బిరుదు అంబారి చెంద్రా యుధము మకర తోరణాలు పగటి దివిటీలు నెమిలి పించాలు భుజకీర్తులు, కిరీటము, భూచక్రగొడుగు, అష్తాగిరి పాలీక నగుబోతు, నగారాధముకా నిషానీ, హనుమంతు నిషాని, ఏనుగుమీద ఢముకా ఒంటెమీద ఢముకా రణభేరి సింహమూతి కడియాలు మకర కుండనాలు సింహతలాట అంబారి మహిమా రుతబా గరుడ పడిగెలున్న హనుమంత చక్రములున్న అల్లా పద్మములున్నూ శంఖాలున్నూ వీరణమ్ములున్నూ శ్రీరామ కొణితలున్నూ సమస్థ రాగాలున్నూ బసువ చెక్రపు గొడుగులున్నూ చుట్టు వీటెలున్నూ జంగపు గొడుగులున్నూ శ్రీరామ కాని యాదవ పీఠము నిర్ణయంబైన తారీకు 5002 అక్షయ సంవత్సర సృష్ట్యాది శతాబ్దం 1955 మరియు 5002 రాజాధిరాజ ప్రతాపరుద్ర మహారాజు యాభై యారు రాజ్యములకు ఇచ్చిన సనదు ముతాబికు మరిమాత రేపల్లెవాడ మసీదువ మల్లన్న మఠం దీనిక్రింద పూదుగుల్‌వ చిరాగువ, మరమ్మతు హమేషా దుచావరుజమాను సఫీలు బయటము, గూమవరము, మర్లగడ్డ మక్తా 305 బిగాలు రామస్వామి గుట్టవద్ది మక్తా 325 బిగాలు తోకపుట్టి చరాయపట్టి, వజాతర్లు మల్లన్న జాతర్లు వబీర్ప జాతరు వగొల్లల కురుమల దగ్గర రుసూంసాలు బసాలు రుసూం