346
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
బోనగిరి ఖిల్లా కూడా వరంగల్ ఖిల్లా కూడా ఈ దనుగురు కొండయ్య పరంపర తయారుచేయించినట్లుగ మన దగ్గర కొండయ్య - సనదులు వున్నవి కదా! అందును గురించి అదే పరంపర ఆంఖిల్లా గోత్రం సూర్యవంశగురు బసవేశ్వరుని శిష్యుడైన ఈ కొండయ్యను పిలిపించి నేను విచారింతునని చెప్పి కొండయ్యను నాగజర్రి రేపల్లె వాడనుంచి పిలిపించుకొని వందనాది క్రియలచే పూజించి మేము ఖిల్లా కట్టటమునకు పులుగంపోసి ప్రయత్నం చేస్తే కుదురలేదు. ఎందునిమిత్తార్థం? పూర్వము మీ పరంపర వారు భోనగిరి ఖిల్లా వరంగల్ ఖిల్లా కట్టివున్నారు మీరు అదే సంతతి కాబట్టి ఇదీ కూడా మీవల్లనే కావలెను గాని ఇఘ ఎవరినుంచి కాదని అడిగి చాలా మనవి చేసినందున కొండయ్య సమ్మతించి అక్కడ వీరు అడుగక మునుపే తాను చేసియుంచిన యావత్తు కరామతు బయానుచేసి దౌలతు చూయించి సాదుగోకుల్‌దాసుభావిలో బంగారి పుతులీ అయివున్న రామతు చెప్పి ఆ స్థళ మహత్తు అంత చూపించి ఇదే కొండయ్య పేరు తోటి 1087 సం॥రములకు సరి అయిన ఖరనామ సంవత్సర భాద్రపద శు॥ 5 శుక్రవారము 13 పదమూడు ఘడియల రాత్రికి పులగం పోసినాడు తర్వాత ఖిల్లా యావత్తు తయారు చేయించినాడు. ఈ కొండయ్య చూపించిన దౌలతు తోటి ఖిల్లా తయ్యారు అయివున్నది. ఖిల్లా తయ్యారు అయిన పిమ్మట సుల్తాను అబ్దుల్లా కుతుబుసాగారు బాదుషా తమ మురుషదుతో బయాన్ చేసినది ఏమనగా (2) ఈ దనుగురు కొండయ్య దేవ కల్యాణమునుండి వచ్చి మన స్థళమందు రేపల్లెవాడ కట్టుక నాగజిత్ర తోడుకొని మర్రిమాత యల్లమ్మను నిలబెట్టుకొని మల్లన్న మఠము కట్టుకొని యాదవ పీఠము సమేతముగా ఇంత మహత్తు జరుపుతూ వున్నాడు, మనకు తెలియలేదు, మనము పిలిపించి విచారించితే బహుకరామతు చూపించి బావిలో బంగారు పుతిలీని దౌలతు చూపించినాడు. వీరు లక్ష్మీప్రసన్నులు కనుక మన కోరికలు ఈడేర్చి మనల కృతార్థులు చేసినాడు. వీరితోనే మన గద్దినిలిచియున్నది. కనుక ఈ కొండయ్యకు ఏమి కావలెనో ఏమి అడుగుతాడో విచారించమని చెప్పిన సయ్యదుషా ముస్తఫా మురుషదు కాదరీగారు కొండయ్యతో చేసిన మారుజా ఏమనగా! (3, ఏ - కొండయ్య బాదుషాగారు ఏమి కావలెనో ఏమి అడుగుతాడో మిమ్ముల విచారించమని అన్నాడు కనుక మీరు పెద్దలు కనుక నీకు ఏమి కోరిక వుంటే ఆ కోరిక అడుగమని