Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొల్లకొండయే గోలకొండ

ఇది గోలకొండకు సంబంధించిన శాసనము. గోలకొండకు సమీపములో రోజా అను గ్రామములో ఉన్న ఒక గొల్లవద్ద అతని పూర్వికుల కిచ్చిన సనదుకలదు. ఆ సనదు పార్సీలోను తెనుగులోను ఉన్నది. రెండును ఒకే సమయములో గోలకొండ బాదుషాచేత వ్రాయించి యియ్యబడినవి. భాషను ఉన్నదున్నట్లుగా ఉంచినాము. ఈ సనదులోని కొన్ని విశేషాలను మరొకమారు విశదపరుతుము. ఇది గోలకొండ చరిత్రకు చాలా అనుకూలించునని నా అభిప్రాయము.

ఖిలే మానుగల్‌ ఉర్ఫెగోలుకొండ మహమ్మదునగరు సూబేపరు కుంద బున్యాదుపర్గణే హవేలి బాగానరం మసూఉవుదరే దనుగరు కొండయ్య సాకీన్‌ గోలకొండ రేపల్లెవాడ వలదు కొండ్య, బినుకొండయ్య, ఇబ్బను కొండయ్య పరుమానియ బజానానే కారుకూనాసె వకానుగొయాసె వదేశ మఖానే వదేశ పాండ్యానే వపటేలియాసెవ, కులకర్ణియాసె వరాయాసె, సుల్తాన్‌ అబ్దుల్లా బాదుషాకు తుపుషాగారు. 1086 సంవత్సరములు క్రిందట ఖిల్లా కట్టుటకు ప్రయత్నం చేస్తే కుదరనందున బాదుషాతనము రుషతైన సయ్యదు షాముస్తఫా సాహెబు కాదరీ సాకీన్‌ ఔరంగాబాదు హాలు మొకాం గుల్బర్గాగారితో బాదుషాచేసే బయాన్‌ ఏమనగా మా పెద్దలైన పెద్ద మూలకు కుతుబుషా బాదుషాగారు 964 సం॥రముల క్రిందట (భాగానగరము) దాబానగరము అనుపేరు పెట్టి ఖిల్లా కట్టడమునకు ప్రయత్నము చేస్తే కుదురలేదు. సీసకమ్మగుట్టల మీద కిలా కట్టడమునకు పులుగంపోస్తే అది కుదురలేదు. ఈ ఖిల్లా కుదురలేదు. ఇప్పుడు మనము పులుగంపోసినా కుదురలేదని ఆలోచనచేస్తే ఆ మరుషతు బాదుషాతో చేసిన బయాన్‌ ఏమనగా (1) వరంగల్‌ ప్రతాపరుద్ర మహారాజుగారికి దనుగరు కొండయ్య చాలా కరామతును చూయించి