342
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అనుయాయులను (తబర్రాపాడి) నిందింతురో వారి నాలుకలను కోయింతునని ఆజ్ఞ యిచ్చెను.
అయితే యీ ఆజ్ఞను తనకే మనసుకు వచ్చి చేయలేదు. అప్పుడు ఢిల్లీలో చక్రవర్తియైన జహంగీరు ఇచ్చటి షియ్యాల ఆచారాలను విని వెంటనే తబర్రాను మాన్పింతువా లేదా అని బెదిరించెను. అందుచేత తబర్రా నిలిచిపోయెను. జహంగీరు కోపశాంతికై మంచిమంచి నజరానాలు కూడా పంపబడెను.
మక్కామసీదు
భాగమతీ ప్రియుడు చనిపోయెను. అతని కుమారుడు సుల్తాన్ మహమ్మదు కుతుబుషా రాజయ్యెను. అతడు తన కాలములో చారుమీనారు సమీపంలో మక్కా మసీదును కట్టించెను. దీని శంఖుస్థాపన కథ చాలా రమ్యముగా నున్నది. 1027 హిజిరిలో రాష్ట్రములోని మౌల్వీలను, ఫకీర్లను, అరబి పండితులను పిలిపించి వారి సమక్షములో నిట్లు సెలవిచ్చెను. “మీలో ఎవరైతే ఎన్నడుగాని తప్పకుండా దినమూ అయిదు మారులు నమాజు చేసినారో అట్టివారు దీని శంఖుస్థాపన చేయవలసినది” అందరూ ఒకరి మొగము ఒకరు చూచుకొనుచున్నారు. అప్పుడు పాదుషా తానే శంఖుస్థాపనకై మొదటి రాతిని పాదుకొలిపినాడు. అంటే ఆయన నమాజు తప్పని మతాభిమాని అని తేలిపోయింది. ఆయన కాలములో ఈ మసీదుకు గాను 30వేల హొన్నులు వ్యయము జేసినాడు. పని చాలా తిన్నగా సాగుతూ వచ్చింది. ఆయన కాలములో అది పూర్తికాలేదు. తర్వాత అబుల్‌హసన్ తానాషా కాలములో కూడ నిర్మాణము జరుగుతూ వచ్చెను. అప్పటికిని పై కప్పు పూర్తి అయ్యేనే కాని దానిపై మీనారులు ప్రారంభమే కాలేదు. తర్వాత అతనికి పతనము కలిగెను. ఆలంగీరు పాదుషా గోలకొండ రాజ్యాన్ని వశపరచుకొనెను. అతడును ఇంత గొప్ప మసీదుకు మీనారులు మున్నగునవి కట్టించుట సాధ్యము కాదని అక్కడికక్కడే పూర్తి చేయించి ముగించెను. ఇట్లు 1027 హిజరీలో మొదలైన యీ మక్కామసీదు 1104 హిజరీలో పూర్తయయ్యెను. అనగా ఇంచుమించు ఒక శతాబ్దము పట్టెను. ఇప్పటికిని హైదరాబాదు రాష్ట్రములో మక్కా మసీదును మించిన మసీదు లేనేలేదు.