హైదరాబాదు నగర ప్రాచీన స్థలాలు
341
అందు నీరు విడచి రమ్య దృశ్యముగా నేర్పాటుచేసిరి. తర్వాతి కాలములో అందు నీరు విడుచుట లేనందున దానికి “సూఖా హౌస్” అనుపేరు వచ్చి ఇప్పటికిని అదే పేరుతో వ్యవహరింపబడుచున్నది.
ఆషుర్ ఖానా
వీటి సమీపంలోని జామె మస్జిద్ కట్టిరి. దీని నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఖర్చయ్యెను. నదీ తీరమున నదీ మహలునున్ను నబీ బాగునున్ను కట్టిరి. 1003 హిజ్రీలో 60 వేలు పెట్టి “ఇమాంబాడా” ను కట్టిరి. దానినే యిప్పుడు బాదుషాహి ఆషుర్ఖానా అని యందురు. దాని సమీపంలోనే మోతీ మసీదును కట్టించిరి.
చార్‌మినార్
మొత్తానికి ఈ భాగ్య నగరాన్ని మక్కా క్షేత్రమువలె నిర్మించవలెనని పాదుషాకు కోరిక జనించి యుండెను. అందుచేతనే యీ విధముగా నూతన నగరములో కమానులు, హౌజు, వీధులు, మసీదు, బంగ్లాలు నిర్మించెను. అచ్చట మక్కా క్షేత్రములో హజరత్ ఇమాంగారి రోజా ఉన్నది. దానికి ప్రత్యామ్నాయముగా ఇచ్చట చార్‌మీనార్ కట్టించెను. దాని నిర్మాణానికి ఇంచుమించు రెండు లక్షల బంగారు హొన్నులు ఖర్చయ్యెను. ఈ చార్‌మినార్ 1000 హిజ్రీలో నిర్మింపబడెను.
నగర వ్యాప్తి
యథా పాషా తధా ప్రజా. పాషాను జూచి అమీర్లు కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, తోటలు, బాటలు కట్టించి వేయించిరి. నూతన నగరమునకు ఇవి వ్యాప్తి నొందుచుపోయెను. అందుచేత రఖోడా, ఇబ్రహీంపట్నం, బోనగిరి, పటాన్‌చెరువునకు అమీర్లు బంగ్లాలు తోటలు నిర్మించిరి. ఇట్లు నూతనముగా నిర్మాణమై చార్‌కమానుల మధ్యనున్న నగరానికి భాగమతి జ్ఞాపకార్థము “భాగ్యనరగము” అను నామకరణము కావింపబడెను. ఈ నగరములో పట్టీలు ఏటేట నాలుగు లక్షల హొన్నులవరకు వసూలు కావచ్చెను. ఈ పన్నుల నుండియే బీదలకు అన్నదానమునకై 12 వేల హొన్నులకు 60 హొన్నులు లంగరు ఖర్చుకును, తక్కిన మొత్తము మౌల్వీలకును పంచిపెట్టబడుచుండెను. గోలకొండ పాదుషాలు షియ్యా మతస్థులు. అట్లున్నను ఈ పాదుషా ఎవరైతే హజరత్ పైగంబర్ మహమ్మద్ రసూలుగారి ముగ్గురు