Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాథా సప్తశతి

31

పాత్రలను భోగము పడుచులు వేయుచుండిరా యను భ్రమ “హరిదళంబలదుకొన్న యాటవెలది వోలె” యను శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి అనువాదము నుండి కలుగును. కాని మూలమందు “నటి” వలె యనియే కలదు. “సురత నాటకము మనకు పూర్వరంగము” (4-44) అని యొకచో వర్ణించుటచేత రంగములు, పూర్వరంగము అను నాటక లక్షణములు పాటింపబడినవని యూహింప వీలుకలుగుతున్నది. మరొకతావున (4-51) నాట్య సూచన చేయబడినది.

గోడల మీద చిత్తరువులు వ్రాయించుకొనుచుండిరని తెలిపినాను. మరొకటి కనుడు.


మలినచిత్తుడైన మరదికి నిల్లాలు
గోడమీద వ్రాసికొన్న యట్టి
రాము వెంట దిరుగు సౌమిత్ర చరితంబు
చిన్న నవ్వుదోప జెప్పిచూపు. (1-35)


సమిష్టి కుటుంబాలలో నందందు రావణాంశజులుండుట చిత్రము కాదు. అందు నొక కవి మరల ఇట్లనెను.


చెడ్డ మనసు కలిగి యడ్డాడు మరది బా
ధలను దెగువగల్గు దయితుతోడ
చెప్పదింటి బ్రతుకు చెడునంచు మదిలోన
యడచి నవయు కోడలార్యశీల. (1-59)


“బ్రతుకు బొంగరంబు వంటిది” (5-6) అని తెలుగుసేతలో కలదు కాని మూలమందు 'చలం జీవనం' అని కలదు. జీవనము శాశ్వతము కాదు అని యర్థమే యనుకొందును. కుండల పోత మోటకూడ నాకాలమందుండెను. దానిని సంస్కృతంలో ఘట యంత్రమనిరి. దానినే “రహట్టఘటక'యనిరి. నేడును 'రహట్‌' మోట యంత్రమును గురించి ప్రకటించుటను గమనించుతున్నాము.

“రిక్తా నమంతి సుచిరం రహట్ట ఘటకా ఇవే హకాపురుషా!” రహట్టపై భట్టశ్రీగారిట్లు వ్యాఖ్యానించారు. “రహట్టో ఘటయంత్రం... ఉదకం లబ్ధ్వాయధా ఘటికా ఊర్ధ్వముఖాభవంతి తథా దుర్జనా అపిస్వల్ప లాభ ఏవదర్పేణ మస్తకమున్న యంతి”. పాచికల యాట బహు ప్రాచీనమైనది. కాయలను నడుపు నప్పుడిండ్లకు