30
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పంటలు
వరిచేలు, జనుపచేలు విరివిగా నుండెను.
“పండి తెల్లబారు వరితోటలను జూచి
యేల మొగము వంచి యేడ్చెదమ్మ
చూడు, జనుపచేను సొగసయ్యె హరిదళం
బలదుకొన్న యాటవెలది వోలె” (1-4)
(రహస్య సంకేతస్థానముగా వరికి మారు జనుపచేను సిద్ధమైనదని విలాసినికి
ధైర్యము చెప్పుట).
నువ్వులు కూడా పండించుచుండిరి. (1-3) మరికొన్ని తావులందు (బహుశా మహారాష్ట్ర ప్రాంతమందు) యవలు పండించుచుండిరి. వాటి కడవిపందుల బాధ యుండెను (5-3) సెనగలు కూడా పండించుచుండిరి. (6-57) ఆముదము లేక నూనెతో పత్తిని వెలిగించి దీపముగా వాడుచుండిరి. (3-64) వెలగపండ్లు, లడ్లు జనులకు ప్రీతిగా నుండెను. (7-41) ఓడిపట్టి దుర్దినములైనప్పుడు నిష్ఠాపరులు జ్యోతిశ్శాస్త్ర ప్రకారము గుణించుచుండిరి (5-35; పై ఈ శ్లోకమునందలి వ్యాఖ్యను జ్యోతిర్వేత్తలు చూచుకొనగలరు. ) “ప్రత్తిచేను దున్నవలసి మంచి దినాన మడకపూజలు సేయ” (2-65) యనుటచే ఏరువాక పున్నమ సూచితమవుచున్నది. నేటికినీ ఆంధ్రులు ఏరువాక నాడు మడకపూజ సేయుదురు. (ఏఱు=నాగలి).
వినోదములు
ఆనాటి జనుల వేడుకలో ముఖ్యమైనవి నాటకాలు. అవి యక్షగానాలా? లేక సంస్కృత ప్రాకృత నాటకాలా? గట్టిగా చెప్పజాలము. సంస్కృత మర్యాదలతో కూడిన ప్రాకృత నాటకాలై యుండినవో? సంస్కృతము మాతృభాష నుండి దేవభాషగా హాలుని కనేక శతాబ్దములకు ముందే మారియుండెను. జనులకు వివిధ ప్రాకృతములు మాతృభాషలయ్యెను. కావున జనసామాన్యాని కాహ్లాదము నిచ్చునవి ప్రాకృత నాటకాలేయై యుండును. ఆ నాటకాలకును యక్షగానాల వాసన గోదావరీ ప్రాంతాలలో నుండియుండును. ఆనాటి నుండి యీ శతాబ్దివరకు నాటకాలాడువారు ముఖములకు అర్థళము (హరిదళము- హరితాళము) పూసుకొనుచుండిరి. స్త్రీల