గాథా సప్తశతి
29
ఈ శ్లోకంలో శ్లేష కలదు. దీనిపై సాహిత్యాచార్య భట్టశ్రీ మధురానాథశాస్త్రి గారిట్లు వ్యాఖ్యానించిరి. “జనైః ఓనమః సిద్ధం సిద్ధిరస్తు ఇత్యారభ్యాం వర్ణమాలా మప్యజానంతో లోకాః గౌరవాభ్యధికాః” అని వ్రాసిరి. 'నమఃసిద్ధం' అని సాహిత్యా చార్యులవారు వ్రాయుట పాణినేయులకు, పాతంజలులకు సరిపడునో లేదో? ఉత్తరములు వ్రాసుకొనునప్పుడు 'స్వస్తి అను పదములతో ప్రారంభించుచుండిరి. పూర్వమందలి శాసనాలన్నియు స్వస్తి పదములతో ప్రారంభించుట భారతీయ చారిత్రకులెరిగియే యున్నారు. వ్రాతకు సాధనము లేఖిని యొకటి. తాటియాకులో భూర్జపత్రాలో వాడి యుందురు. గాథలు దాక్షిణాత్యమువి కాన తాటాకులే వాడిరనవలెను. మరి లేఖిని యన గంట మనవలెను.
“వడకి చెమరించు వ్రేళ్ళకు వశముగాక
నిలిచి నడవక జారు నీ కలము తోడ
స్వస్తి శబ్దమె ముగియంప జాలనైతి
కమ్మ నింకేమి వ్రాయంగగలను చెలియ” (3-44)
జనులిండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయించుకొనువారు (3-17). ఆ
యాచారము క్రీస్తుశకము 19వ శతకాంతమువరకు ప్రచలితమై యుండెను. ఇండ్ల
ముందు అరుగుల గదులుండెడివి. అవి పలుమారు బాటసారులకు రాత్రులందు
విశ్రమస్థానాలగుచుండెను. (3-54). ధర్మశాస్త్రోక్తి ప్రకారము పుత్రులు తండ్రుల
బుణములను తీర్చుచుండిరి. (2-13) చలివేంద్రములు పెట్టి పథికులకు
నిదాఘకాలమందు ప్రపాపాలికలు ప్రచురించుచుండిరి. (2-61) రాజులు ధనికులు
ధర్మకార్యములను శాసనాల ద్వారా ప్రకటించుకొనుచుండిరి. (3-32) గ్రామములందు
అగ్ని ప్రమాదములు జరిగినపుడు స్త్రీ పురుషులు బావి వద్ద నుండి బారులు తీరి
చేతుల యంచెలపై కడవలందించి యగ్నినార్పుచుండిరి. (3-29) జనులు మర్రి
యాకులను విస్తళ్ళుగా కుట్టి యందు భుజించుచుండిరి. బాటసారులు విశేషముగానట్లు
చేసెడివారు. కాని కాకి మున్నగు పక్షుల రెట్టకలిగిన మర్రి యాకులను వాడకుండిరి.
(2-66) పెద్దవారి యాగమనమున వారి యడుగులకు మడుగులొత్తు చుండిరి.
వారింటికి రాగానే రెండు కలశములతో కాలు మొగము కడుగుకొన నీరిచ్చుచుండిరి.
(2-40)