26
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
రంగులు చల్లుకొనుచు వినోదించెడి వారు. (4-69) 6-35 చూత లతికా క్రీడయనున దుండెను. ప్రియతమ నామమేమి చెప్పుమని ప్రియులు చూత లతికతో లేక నవ పలాశ లతతో కొట్టుట యీ క్రీడా విశేషమట! (1-28; 5-56) శైవ సాంప్రదాయకము లోని కాపాలికులందందుండిరి. (5-8) ప్రజలకు శకునాలపై విశ్వాసముండెను. “ఏ కోపి కృష్ణ సారో నదదాతివలనన్ ప్రదక్షిణం గంతుం" (1-25)
ధన నిక్షేపములు
నిన్న మొన్నటివరకు మనదేశమందలి ధనికులకు భూవివరములే బేంకులై యుండెననగా ఆ కాలమందు జనులు ధనమును, వెండి, బంగారును భూమిలో పూడ్చి దాచి పెట్టుకొనుచుండిరనిన చిత్రముగాదు. గాథలందు విరివిగా నీవిషయ చర్చలు వచ్చినవి.
“తగిన చోటు గాదు దాచుట కిది; యేల
సాహసంబు జేయ జనెదు కొడుక! 2-54
భూమిలో పాతిన ధనము పలుమారు నష్టమైనదని యిందు సూచితము.
“చరోజనులు సారె సారెకు జూతురు
భయము కోరికయును పైకొనంగ
వీరవరుని పత్ని వీగు జన్నుల; పాము
కాచు కొన్నలిచ్చి కడవలట్లు 6-72
బహుకాలము భూస్థాపితమైన ధనములపై పాములు కావలి యుండునన్న
విశ్వాస మానాటికే ప్రాతదై యుండెను.
శిక్షలు
శిరచ్ఛేద శిక్ష పొందిన వాణ్ణి వధ్య స్థానమునకు తీసుకొని పోవుచూ తప్పెట వేసి యందరికి తెలియునట్లుగా వాని తప్పును, వాని శిక్షను ప్రకటించెడి వారు.
దొంగతనం చేసిన వారికి మరణ దండనము, శ్మశానమందు చెట్టుపై వ్రేలాడ గట్టట యానాటి యాచారముగా కానవచ్చును. "శంకా శ్మశాన పాదలంబిత చోరే ణేవ ఖరేన” (6–36) అనుటయే నిదర్శనము. వ్యభిచారులను గ్రామాధికారులు శిక్షించుచుండిరి. (6-56)