Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాథా సప్తశతి

25

మత విశ్వాసాలు - ఉత్సవములు

ఆ కాలమందు కొన్ని పురాణ దేవతలకు విశేష వ్యాప్తి యుండినట్లున్నది. రామలక్ష్మణులు (1-35) వామనుడు (5-6) రాధాకృష్ణులు (1-89) గణపతి (4-79) పేర్కొనబడినారు. అందు పాపము గణపతి పొట్టగలవాడగుటచే ఒక విలాసినికి రహస్య సంగతిలో తలగడగా పనికి వచ్చెను.

యౌవనములో సురతసమయ పరిధానీకృత గణపతి వార్థక్య దశలో పాప పరిహర్తగా పూజితుడయ్యెను. ఎందరు పౌరాణిక దేవతలు పుట్టినను గిట్టినను నేటివలననే నాడును గ్రామదేవతలకే ప్రాముఖ్యముండెను.


“ఈవు చేతులారా నిచ్చినదని ప్రాచి
పూలసరము తావి పోయి యున్న
నింతి దాల్చుచున్న దింకను, వ్రత పూజ
ముగియ, నూరి వేల్పు బొమ్మవోలె (2-94)


(ఉదాహృతాంధ్ర పద్యములన్నియు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారివని యెరుగవలెను). ఆ గ్రామ దేవర్లకు దున్నపోతుల బలి ఇచ్చుచుండిరి.

కేవల హిందూ మతమే కాక బౌద్ధమతము కూడా మంచి వ్యాప్తిలో నుండెను. అందుచేత రెండు తావులలో తత్ర్ప క్తియు వచ్చినది.


భిక్షకుండు నాభి నీక్షించుచుండగా
నదియు వానిమోము నరయుచుండె
అతని చేతిచిప్ప నామె చేతుల తట్ట
కాకులేరి తినుచు గాకుచేసె (2-62)

ఇచట వీడు దొంగ సన్యాసి!

చిలుక ముక్కు వన్నెచే నొప్పు మోదుగు
పూలవరపు పొలిచె నేలనెల్ల
బుద్ధ దేవు చరణములు మ్రొక్క బుడమిపై
వ్రాలియుండు భిక్షు జాలమట్లు 4-8


స్త్రీలు వాయనము లిల్లిల్లు దిరిగి యిచ్చు వాడుక యుండెను. (4-28) పండుగలలో హోలీ పండుగ (ఫల్గుణోత్సవము) చాల ముఖ్యమైనది. స్త్రీ పురుషులు