అప్పకవి
ఇటీవల ప్రచురితమైన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రెండవ భాగము చూచితిని. అప్పకవిని గురించి ఇందు ఇంచుక వ్రాసినారు. అతడు గుంటూరులో వాడని నిరూపించుటకు ముప్పుతిప్పలు పడినారు. స్థానికాభిమానముతో అట్లు వ్రాయుట కారణము కానరాదు కాని నిజాం రాష్ట్రమువారి యభిప్రాయముల గమనింపని వివేకము వారికి చేకూరినది. కందుకూరి వీరేశలింగము పంతులువారు అప్పకవి కృష్ణామండలము వాడని వ్రాసిరి. మరియు శతఘంటము వేంకటశాస్త్రిగారు తమ భారతపీఠికలో నిదే సూచించిరి. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమువారు ప్రథమ ముద్రణములో అప్పకవి గుంటూరు వాడని వ్రాసి ఇప్పుడును అదేమాట వ్రాసినారు. కాని యిది సరియైనది కాదు. సంపూర్ణంగా తప్పువ్రాతయే. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ ప్రథమ ద్వితీయ ముద్రణములును, నిజాం రాష్ట్ర పత్రికలలో మూడు వ్యాసములును బయలుదేరెను.
దేశబంధు మాసపత్రికలో శుక్ల సంవత్సర జ్యేష్ట మాసములో నేను వ్రాసిన వ్యాసము.
బూర్గుల రామకృష్ణారావుగారు గోలకొండ పత్రిక 2వ సంపుటము మొదటి సంచికలో అంగీరస వైశాఖ శు॥లు 2నాడు వ్రాసిన అతివిపులమగు వ్యాసము.
గత సంవత్సరము గోలకొండ సంచికలోని పూర్వకవి భాగములో శ్రీ శేషాద్రి రమణకవులచే సంకలిత వివరణము.
ఇవన్నియు సర్వస్వమువారు చూడకపోవుట తటస్థించినది. ఈ సవరణ వ్యాసమును గూడ చూడకుండిన నాశ్చర్యమేమి?
ఈ వ్యాసమును నేను నిజాం రాష్ట్రాభిమానముతో వ్రాయుటకాదు. యథార్థమును వెల్లడించుటయే దీని యుద్దేశ్యము. అప్పకవి మరియు నిచ్చటివారు