132
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ద్వితీయ కందము
భవ బంధనములఁ దెంచుచు
భువిలోన జ్ఞాన పదముఁ బొందక ప్రాజ్ఞులు
శివుగొల్తు రచల భావనఁ
దవులన్ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్”
తృతీయ కందము
“అజ్ఞాన పదముఁ బొందక
ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచల భావనఁ దవులన్
సుజ్ఞానయోగతత్వవి
ధిజ్ఞుల్ భవబంధనములఁ ద్రెంచుచు భువిలో”
చతుర్థ కందము
“శివుగొల్తు రచల భావన
దవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞుల్
భవబంధనములఁ ద్రెంచుచు
భువిలోన జ్ఞాన పదముఁ బొందక ప్రాజ్జుల్”
సీసము
కవిరాజు క్రొత్త మార్గమునకుఁ దిప్పి సొగసుగా రచించిన మఱియొక పద్యము సీసము. చోడుని సీసములందు తూఁగు సీసములే మెండు.
“వెలిమిడి నలికంబు చెలుపంగఁ బోవుచోఁ
దెలుపార మై నిండ నలది కొనుచుఁ
బూవులు దుఱుమంగఁ బోవుచో వెలిగొంత
దోపంగ నడ్డంబు దురిమికొనుచు
మోవిలత్తుక బూయఁబోవుచో లాలాట
పట్టిక దిలకంబు వెట్టికొనుచు
కాటుక మెదుచుచు గన్నుల నిడబోయి
పొల్తుక గళమున బూసికొనుచు