ఈ పుట ఆమోదించబడ్డది
నన్నెచోడుఁడు
131
తన చిత్తము వచ్చినట్లు కందమును నడపించినవాడీతఁడు. ఎన్ని పోకలవలంబించిన నన్ని పోకలంబోయినది. దుష్కర ప్రాసముతోఁ బొల్లు మాటలు లేక వచనమువలె సాగిపోయిన కందములీతని కృతియందనేకములు.
“చక్షు మదనేంద్రియములు ము
ముక్షులు మదిగెలుతు రెఱిఁగిమును శ్రోతృత్వ
కుక్షు ర్జిహ్వాఘ్రాణస
పక్షగ వాక్పాణి పాద పాయూపస్థల్”
శ్లేషాభి రామమగు కందము నడచిన తీరు:
“కమలాభి శోభితము హరి
రమణీయము విద్రుమాభి రామము శుకర
మ్యమునై గగనాబ్దులతో
సమమై వనమధ్య జలజషండం బొప్పెన్”
చతుర్విధ కందము
“రెండవ చరణంబునకున్
రెండవ గణమాది గాగ నిర్మించినచో
దండిఁ జతుర్విధ కందము
పాండవ పక్షా! మెలంగు బ్రాజ్ఞుల సభలన్”
నన్నెచోడుని చతుర్విధ కందము
ప్రథమ కందము
“సుజ్ఞాన యోగతత్వ వి
ధిజ్ఞులు భవ బంధనముల ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁగొల్తు రచల భావనఁ దవులన్”