130
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
జేసి పంచమాశ్వాసమును సంభవింపనున్న కంతుని వీరవిక్రమమును, రుద్రుని రౌద్రమును సూచించెనని నుడువ వచ్చును.
శార్దూల విక్రీడితము
శార్దూల విక్రీడితము జెప్పుటలో తిక్కన ప్రసిద్ధుడని చెప్పుటకుదాహృతమున ఈ పద్యమును సూచింతురు.
“సింగం బాఁకటితో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునో
జం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపైఁ వీడే వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమర స్థేమాభిరామా కృతిన్”
ఇంతటి నేర్పీతనికి నేర్చినవాడు నన్నెచోడుడుగా నోపును.
“భర్గుండంతక వాహినుల్........... మద్బాణ వర్షంబునన్”
“వీరేకాదశ రుద్రులష్ట వసువుల్
........................ సుమహద్విఖ్యాత కార్తీశ్వరా!
శౌర్య వర్ణనతో నిండియున్న పై పద్యములన్నియును అతనెంత జాగరూకతతో
తూచి తూచి వ్రాసినాడో తెలియనగును.
ఒక్క శార్దూలమునకే గాక తక్కిన పద్యముల వాడుట యందు కూఁడ నన్నెచోడుఁడు ఔచిత్య పోషణ గావించినాడు.
కందము
కథాగమనమును శీఘ్రతర మొనర్చుటకీ కందము మిక్కిలి యనుకూలము. చోడుఁడు వాడిన పద్యము లనివియే నెక్కుఁడుగ నున్నవి.
“తగుఁదగదని మనమును
వగవగ నొడబడగ వగవ వగవగ బడయున్
దగుదగదని వగవని వగ
వగవగఁ బని గలదె తనకు వగ మఱి జగతిన్”
ఇది సర్వ లఘు కందము. దీని నడక చూచిన పోతరాజు “లక్ష్మినడక”
మనకు జ్ఞప్తికి రాక దప్పదు. కనుక నీ విషయమునకు ఆతనికీతఁడు మార్గదర్శకుడైనాడు.