నన్నెచోడుఁడు
129
ఉద్భటుని సంస్కృత కృతి దీనికి మూలమని తెలియనగును.
తారకాసురమర్దనుని చరితయందు, సంస్కృతమునలేని “దక్షయజ్ఞ” చరితమును ఈతడు తన కావ్యమున బ్రవేశపెట్టెను. గణపతి జననముసైతమీతని కృతియందు విశేషము.
శ్రీకారముతో బ్రారంభించి (మంగళమహా)శ్రీకారములో ముగించు పద్ధతి గూడ నీతఁడే ప్రవేశపెట్టెను.
“మ' గణము గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపు వానికి మరణం
బగునిక్కమండ్రు, మడియఁడే
యగునని యిడి తొల్లి 'టెంకనాదిత్యుడనిన్”
నన్నెచోడుఁడు తత్కారణముగ యుద్ధమున మడిసెనని అభిప్రాయపడుచున్నారు.
నన్నెచోడునిది వస్తుకవిత. అనగ వస్తు ప్రధాన కవితయని విన్నకోట పెద్దన వచించెను.
ప్రకృతి పరిశీలనము నందును, వర్ణనానైపుణియందును సిద్ధహస్తుడైన చోడుఁడు తనంతతానే తనది వస్తు కవితయని చెప్పుకొనినాడు.
“నింగిముట్టియున్న జంగమ మల్లయ
వరమునందుఁగనిన వస్తుకవిత
దగిలివారి యంద నెగడింతు రవికి దీ
పముననర్చలిచ్చు పగిదివోలె”
“జంగమ మల్లికార్జునుని సర్గకవి స్తవనీయ సూక్తియు
క్తింగొనియాడి సత్కవితఁ గానము లేకసురక్తియైన భా
షాంగనఁ దక్కనేలిన మహత్వము లోకమునం బ్రసిద్ధిగా
భంగిగ విస్తరించెదం బ్రబంధము సద్రసబంధురంబుగాన్”
ఆశ్వాసాంతమున కందమును వాడుట పరిపాటికాగా నన్నెచోడు 'మాలినిని”
వాడినాడు. తదుపరి కవులెల్లరకును ఇందు మార్గదర్శకుడైనాడు. “వనమయూర'
వృత్తమును తృతీయాశ్వాసాంతమున విరచించినాడు. చతుర్థాశ్వాసాంతమున 'వసంత
తిలక' వృత్తమును రచించెను. “వసంత తిలకం భాతి సంకరే వీరరౌద్రయోః” అనుటం