ప్రవేశిక
11
అసంతృప్తిని పోగొట్టాలి. ఆ దిశగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అందిస్తున్న ప్రచురణల్లో 'తెలంగాణ సాహిత్య చరిత్ర', 'తెలంగాణ ప్రాచీన కవుల కవితా ప్రాభవం', 'తెలంగాణ మాండలిక పదాలు - కావ్యప్రయోగాలు', 'కుతుబ్షాహీల తెలుగు సాహిత్యసేవ', 'మాఊరు మాట్లాడింది', 'తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలు’, 'సురవరం ప్రతాపరెడ్డి వ్యాసావళి', 'తెలంగాణ ప్రముఖుల పరిణతవాణి', 'బంజారాల వివాహ ఆచార పద్ధతులు', 'యాభై సంవత్సరాల జ్ఞాపకాలు', 'తెలంగాణ చరిత్ర', 'తెలుగు జానపద సాహిత్యం- స్త్రీల గేయాల్లో సంప్రదాయం' ఈ సంవత్సరం వెలువడుతున్నాయి.
నిద్రాణమైన తెలంగాణ భాషా సాంస్కృతిక సీమలో తమ బహుముఖీనమైన వాఙ్మయ సృష్టితో వెలుగులు నింపి పునరుజ్జీవింపజేసిన ఘనత సురవరం ప్రతాపరెడ్డి గారికి దక్కుతుంది. తొలితరం కథారచయితగా, ప్రౌఢతర పద్య రచన చేసిన కవిగా, పరిశోధకునిగా, విమర్శకునిగా, పత్రికా సంపాదకునిగా అనేక అంవాల్లో ప్రతాపరెడ్డి గారిని తెలంగాణకు వైతాళికునిగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా తెలుగు బాషా సాహిత్యాలు అణగారి వున్న కాలంలో కూడా కవులకు కొదవలేదని చాటి చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతస్థానంలో నిలిపారు. వారి జీవిత చరిత్ర రచన, రచనల పునర్ముద్రణ విషయంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు చేసిన కృషి ఎన్నదగింది. విద్వన్మణి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సురవరం వారిపై ప్రామాణికమైన పరిశోధన చేసినారు. సురవరం గురించి సాధికారికంగా ప్రసంగించే వారిలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రథమ స్థానీయులు. సురవరం వారి రచనలు ఈనాడు చాలావరకు లభిస్తున్నాయి.
సాహిత్య సాంస్కృతిక అంశాలపై వారు రాసిన వ్యాసాలు అమూల్య సంపద. ఇవి అలభ్యమని చెప్పి రెండు సంపుటాల వ్యాసాలను మాకు ఇవ్వటంతో పాటు పునర్ముద్రించే అవకాశం కల్పించిన సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు వారికి, డా. సురవరం పుష్పలత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
దీని సంపాదకులుగానే గాక పరిషత్తు ప్రచురణల పరిశీలక సంఘం సభ్యులుగా తమ పూర్తి సహకారాన్ని అందించిన ఆచార్య ఎస్వీ రామారావు, సభ్యులు డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. డి. చంద్రశేఖర్రెడ్డిగార్లకు కృతజ్ఞతలు.
హైదరాబాదు
తేది: 20 మార్చి, 2015
(జె. చెన్నయ్య)