Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డా॥ జె. చెన్నయ్య

తిలక్‌ రోడ్‌,

ప్రధాన కార్యదర్శి

హైదరాబాదు-500001.

ఆంధ్ర సారస్వత పరిషత్తు

ఫోన్‌ : 040-24753724


ప్రవేశిక


ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న విభిన్నమైన కార్యక్రమాల్లో పుస్తక ప్రచురణ విశిష్టమైంది. పరిషత్తు ప్రచురించిన గ్రంథాల పట్టికను చూస్తే ఎంత గొప్పవైన ప్రచురణలు వచ్చాయో తెలుస్తుంది. పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు పరీక్షల నిర్వహణ, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి దోహదం చేసే సదస్సుల నిర్వహణ, పెద్దల పేరిట నిర్వహించే సంస్మరణ ప్రసంగాలు, పరిణతవాణి ప్రసంగ పరంపర కొనసాగుతూ అనుబంధంగా పుస్తక ప్రచురణ జరుగుతున్నది. 2013 సంవత్సరంలో పరిషత్తు అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి నేతృత్వంలో సప్తతి పూర్తి సందర్భంగా ఏడాది పొడవునా అనేకమైన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ‘తెలంగాణ తెలుగు సాహిత్య వికాసం’, ‘తెలంగాణ ప్రాచీన కవుల కవితా ప్రాభవం’, ‘తెలంగాణ మాండలిక పదాలు-ప్రయోగ రీతులు’, ‘తెలంగాణ ప్రాచీన నృత్య రీతులు’, ‘తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు’, ‘తెలంగాణ కవయిత్రులు, కథయిత్రుల సమ్మేళనం’ వంటి అనేక సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని పెంపొందించే కృషిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పరిషత్తు భావించింది. నవ్యస్ఫూర్తితో ప్రచురణల్ని కూడా వెలువరించాలని నిర్ణయించింది. గత సంవత్సరం పరిణతవాణి ప్రసంగాలతో కూడిన తాజా సంపుటి, ‘తెలంగాణ సాహిత్య వికాసం’, ‘వ్యాసగుళుచ్ఛం’ రెండు సంపుటాలు ప్రచురించడం జరిగింది. వాటిని పాఠకులు ఆదరించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ నూతన యుగోదయవేళ తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనం జరగాలి. ఆ అధ్యయనానికి కావలసిన పఠనసామాగ్రిని సమకూర్చుకోవాలి. ఇప్పటివరకు ఉమ్మడి చరిత్రలో అంతర్భాగంగా వుండి తగినంత ప్రాధాన్యం లభించలేదని ప్రజల్లో వున్న