Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్లెపాటలు

107


“గోదావరికి పోయి
గోవిందునికి మొక్కి
కడతేరి పోతానురో
వెంకయ్య -
కడసారి చూపిదేరో
యంకయ్య”

“స్వర్గ లోకములో
చల్లనీ చోటులో
సరసము లాడుదామే
చంద్రమ్మా -
చందమామను చూతమే
చంద్రమ్మా” -


ఇట్టి వెన్ని అజ్ఞాత వాసము చేస్తున్నవో ఆంధ్ర విజ్ఞాన ప్రియులంతా అన్వేషించి వాటి నుద్ధరించవలసి యుండునని మనవి చేస్తున్నా.